Skip to Content

పరిశుద్ధాత్మ నింపుదల | The Outpouring of the Holy Spirit

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

పరిశుద్ధాత్మ నింపుదల 

యెషయా 44:3 నేను దప్పిగలవానిమీద నీళ్లను ఎండిన భూమిమీద ప్రవాహజలములను కుమ్మరించెదను నీ సంతతిమీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టినవారిని నేనాశీర్వదించెదను.ఎండిపోయిన కటిక నేలవంటి ప్రదేశాలను మనం గమనించినప్పుడు, అటువంటి ప్రదేశాల్లో దాహాన్ని తీర్చుకోడానికి, ఆ నేలను తిరిగి సారవతమైన నేలగా మార్చాలంటే కాసిన్ని నీళ్ళతో సాధించలేము కదా. మన ఆత్మీయ జీవితమూ ఎండిపోయిన స్థితి నుండి పూర్వవైభవాన్ని పొందుకోవాలంటే అనుభవజ్ఞుమైన దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మనలో సంపూర్ణంగా సమృద్దిగా నింపబడాలి. ఆ ఆత్మ మనల్ని ఓదార్చడానికి, బలపరచడానికి, సరిచేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి మరియు మనల్ని నిలబెట్టడానికి సహాయపడుతుంది.

ఈ రోజు, దేవుడు తన కృప యొక్క ఆశీర్వాదాలను ఇవ్వడానికి తన పరిశుద్ధ ఆత్మను మనపై కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎండిన నేలను పునరుద్ధరణ జేసే నీటిలా ఆయన తన ఆత్మను మనపై కుమ్మరిస్తాడు. నేనంటాను, ఆయన మనకు తన కృప యొక్క ఆశీర్వాదాలను దయజేస్తాడు, అందులో దేవుని ప్రేమతో కూడిన ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. అంతేకాదు, అవి మన ఆత్మీయ దాహంతో ఉన్న ఆత్మలను ఉజ్జీవింపజేస్తాయి. ఆయన మనకు తన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, అది జీవ నదిలా పారుతుంది. అది ఈరోజు మన జీవితంలోనే కాదు, మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు కూడా ప్రవహిస్తుంది.

ఆధ్యాత్మిక సంతృప్తి  మరియు పునరుద్ధరణ అవసరమయ్యే వారికి తన కృపాశీర్వాదాలు గొప్ప ఓదార్పును కలుగజేస్తాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మన ఆత్మలు ఎంత ఎండిపోయినా, దాహంతో ఉన్నా, దేవుడు తన ఆత్మను మనపై కుమ్మరించి, తన కృప యొక్క ఆశీర్వాదాలను ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/kYdzlwt_-Ps

The Outpouring of the Holy Spirit 

Isaiah 44:3 For I will pour water on the thirsty land, and streams on the dry ground; I will pour out my Spirit on your offspring, and my blessing on your descendants.

Living in a place that is often quite dry, the imagery of water to quench our thirst and irrigate parched ground means so much. But the imagery does not come close to the experience of God-s Spirit coming to us to comfort, strengthen, gift, empower, convict, guide, and sustain us. When our souls are parched and our spirits are dry, nothing — absolutely nothing — can relieve the dry brittleness within us except the Holy Spirit of God. 

Today, God is promising that he will pour out His Spirit upon us to give the blessings of His grace. He will pour out His Spirit upon us like water which refreshes and revives the dry ground. He will give us the blessings of His grace which will be as a flood of goodness and will be sufficient to satisfy our thirsty souls. He will give us His blessing which will be like a river of life and will flow on to our children and our children-s children.

Jesus is giving you a promise today that His grace and blessing is a great comfort to those who need spiritual refreshment and renewal. It is a reminder that no matter how dry and thirsty our souls may be, God will always be there to pour out His Spirit upon us and give us the blessings of His grace. Amen.       

Connecting With God

English Audio: https://youtu.be/T0ilsXxbHv0

Share this post