Skip to Content

నీతోనే ఉన్న నీ దేవుడు | God is always with us.

16 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

నీతోనే ఉన్న నీ దేవుడు

ద్వితీయోపదేశకాండము 31:3 నీ దేవు డైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశ మును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి యున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును.

మన ముందు ఉన్న జీవితం కొరకు ఎన్నో ప్రణాళికలను సిద్దం చేసుకుంటాం. అయితే, దేవుడు మన ఆలోచనలు మన తలంపుల కంటే ఎల్లప్పుడూ మనకంటే ముందు ఉంటాడని, మనకు మార్గాన్ని సుగమం చేస్తూ, మనకు అడ్డంకిగా ఉన్న ప్రతి అడ్డంకులను తొలగిస్తాడని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అన్ని ద్వారాలు మూసికొని ఎటువంటి దారి చూడలేనప్పుడు కూడా ఆయన మనకు ఒక నూతన మార్గాన్ని ఏర్పరుస్తాడు. మనం ఎదుర్కొనే ఎటువంటి క్లిష్ట పరిస్థితులు లేదా సవాళ్ల ద్వారా మనకు మార్గనిర్దేశం చేసేలా ఈరోజు ఆయనను విశ్వసించవచ్చు.

ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి నడిపించడానికి దేవుడు యెహోషువను ఎన్నుకున్నాడు మరియు నీవు నడుచు మార్గంలో నీకంటే ముందుగా నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. యెహోషువను దేవుడు నాయకుడుగా నియమించాడు. దేవుడు మనపై నియమించిన నాయకులపై నమ్మకముంచి, అట్టి నాయకులను నడిపించిన దేవుడు నేడు మనల్ని కూడా నడిపించగల సమర్ధుడని విశ్వాసిద్దాం. ఒకవేళ ఈ మాటలను నీవు విశ్వసిస్తే ఒకసారి ఆమెన్ చెప్దామా. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/I_glffRFKZM

God is always with us.

Deuteronomy 31:3 The Lord your God himself will go over before you. He will destroy these nations before you, and you shall dispossess them. Joshua will go over before you, as the Lord has spoken.

Today, we can take comfort in this promise because it reminds us that God is always ahead of us, clearing the path for us and removing any obstacles that may hinder us. He goes before us, making a way for us even when we can-t see the way ourselves. We can trust Him to guide us through any difficult circumstances or challenges that we may face.

We should also learn to follow our leaders. God had chosen Joshua to lead the Israelites into the promised land, and He promised to go before him as well. It is essential to have faith in the leaders that God has appointed over us and to trust that God is guiding them as well.

Therefore, let us remember that God is always with us, and we can trust Him to guide us through every step of our journey. Amen.

English Audio: https://youtu.be/cP4RjaKfd3g

Share this post