Skip to Content

మన కాపరి | Our Shepherd

  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

మన కాపరి

కీర్తన 95:6 ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము. 

దేవుడు మన ప్రేమగల కాపరి, మరియు మనము ఆయనకు ప్రియమైన వారము. దేవుడు మన కోసం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తాడు మరియు ఒక గొర్రెల కాపరి తన మందను గూర్చి జాగ్రత కలిగి ఉన్నట్లే దేవుడు మన పట్ల తన ప్రేమ ద్వారా సమృద్ధిని దయజేస్తాడు. దేవుడు మనలను ఎల్లప్పుడూ బధ్రపరుస్తూ రక్షిస్తాడు మరియు మనలను సరైన దిశలో నడిపిస్తాడు. కష్ట సమయాల్లో మనం పొందవలసిన ప్రేమ, సౌకర్యం మరియు బలాన్ని మనకు అందించడానికి ఆయన మనకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆ దేవుడే మన ఏకైక కాపరి, ఆయన పాలించే ప్రజలము మనము. 

దేవుని మార్గదర్శకత్వాన్ని విశ్వసించాలని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దేవుడు మనలను ఎప్పటికీ విడిచిపెట్టడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా విడిచిపెట్టడు. మనలోని కొరత సమృద్ధిగా మారాలంటే ఈరోజు మనం ఆయనపై ఆధారపడవచ్చు. దేవుని శాశ్వతమైన ప్రేమకు కృపకు మనం కృతజ్ఞతలు తెలుపుదాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఆయనే మన కాపరి అని మనం ఎప్పుడూ గుర్తుంచుకుందాం. ఆమేన్.

Telugu Audio: https://youtu.be/4WEdsxeLVDU

Our Shepherd

Psalms 95:7 For he is our God; and we are the people of his pasture, and the sheep of his hand. 

God is our loving Shepherd and we are His beloved sheep. He cares for us and provides for us just as a shepherd provides for his flock. God protects us guides us and leads us in the right direction. He is always there for us providing us with the love comfort and strength we need to get through difficult times. God is the ultimate Shepherd and we are His faithful flock. We must always remember to trust in Him and His guidance. He will never leave us or forsake us no matter what. We can always rely on Him to be with us and to provide for us. Let us be thankful for God-s unending love and guidance. Let us give Him our trust and devotion and let us be grateful for the blessings He has bestowed upon us. May we always remember that He is our Shepherd and we are His sheep. Amen.

English Audio: https://youtu.be/g1YdJ294xVI

Share this post