Skip to Content

మన దేవుడు, మన ప్రభువు, కుమ్మరివాడు | Our Lord, Our Father Our Potter

16 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

మన దేవుడు, మన ప్రభువు, కుమ్మరివాడు 

యెషయా 64:8 యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.

ఈ రోజు నువ్వూ నేనూ కుమ్మరి ఇంట్లో పనివాళ్లం. మన ప్రభువు, మనకు తండ్రి అని మన సృష్టికర్త అని మనకు బాగా తెలుసు.కుమ్మరి ఇంట్లో మట్టి ఒక అందమైన ఉపయోగకరమైన పాత్రగా మారడానికి ఒక ప్రక్రియ ద్వారా సిద్ధమవుతుంది.కుమ్మరి మట్టిని సిద్ధం చేసే ముందే ఎటువంటి పాత్రను తయారు చేయాలో కుమ్మరి సంసిద్ధం చేసుకుంటాడు.

మట్టి వివిధ దశల గుండా సిద్ధమై, కుమ్మరి ఏ పాత్రనైతే సిద్ధం చేయాలనుకున్నాడో ఆ రోపంలోనికి వచ్చేంత వరకు దానికి కావలసిన మార్పులు చేస్తూ ఉంటాడు.ఈ రోజు మీరు ఆయన చేతిలో మట్టిలా ఏ స్థితిలో ఏ దశలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని మనం సమర్పించుకుంటూ మన తండ్రియైన కుమ్మరి యొక్క ప్రణాళికలపై విశ్వాసం కలిగి ఉంటూ, ప్రక్రియ ముగింపులో మనం ఖచ్చితంగా ఆశీర్వాదం పొందగలమనే నిశ్చయత కలిగియుందాము.

మన దేవుడు, మన ప్రభువు, మన తండ్రి, మన జీవితాలను పాత్రలుగా, ఉద్దేశపూర్వకంగా మరియు మహిమాన్వితంగా రూపొందించడానికి మన కొరకు కుమ్మరిగా సిద్ధమయ్యడు.మన సృష్టికర్తయైన మన కుమ్మరి నైపుణ్యతపై మనమందరం విశ్వసిద్ధామా. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించును గాక. ఆమెన్.

https://youtu.be/lXten53hTLo


Our Lord, Our Father Our Potter

Isaiah 64:8 But now, O LORD, Thou art our Father; we are the clay, and Thou our potter; and we all are the work of Thy hand.

Today you and i are workmanship in the potter’s house. Lord, as our father knows us well as he is our creator.In the potter house clay must go through a process to become a beautiful and useful vessel.

The potter has the design and form pre-planned before he treats the clay.The clay goes through different stages, drastic changes in form and shape until it gets to desired vessel pre-designed by the potter.

I don’t know at which stage you are today as a clay in His Mighty hands. As we submit ourselves and have faith in the plans of our  potter ,we can be assured of a sure blessedness at the end of the process.He is our Lord and our father who has become our potter to mould and design our lives to be vessels, purposeful and glorified.Shall we all trust in workmanship of our potter, who is our creator. Amen

https://youtu.be/83pmq7O5bpc

Share this post