Skip to Content

మన బలమునకు ఆధారం | Our Source of Strength

16 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

మన బలమునకు ఆధారం

కీర్తనల గ్రంథము 105:4 యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి

ఒకరోజు ఒక బాలుడు గాలిపటం ఎగురవేస్తున్నాడు, గాలి వేగంగా వీస్తోంది, గాలిపటం ఆకాశంలో ఎగురుతోంది. చాలా ఎత్తులో గాలిపటం పెద్ద పెద్ద మేఘాలలో దాగి ఉన్న సమయాల్లో. మీ గాలిపటం ఇప్పటికీ మేఘాల వెనుక ఉందో లేదో మీకు ఎలా తెలుసు అని అతనిని అడిగినప్పుడు? అప్పుడు ఆ బాలుడు. నా చేతిలో ఉన్న దారాన్ని నేను లాగినప్పుడు దాని బరువును బట్టి తెలుసుకోగలనని, ఆ దారామే దానికి ఆధారమని సమాదానం ఇచ్చాడు. 

అదేవిధంగా, అనిశ్చిత మేఘాలు మన జీవితాలను కప్పివేసినప్పుడు, మనం దేవుణ్ణి వెతకడానికి మరియు ఆయనను పట్టుకోవడానికి ఎప్పుడూ అలసిపోకూడదు. మనం ఆయన వైపు చూడటం కొనసాగించినప్పుడు, దేవుడు మనతో ఉన్నాడనే తన ఉనికిని మనకు బయలుపరుస్తాడు, ఆయనే మనకు బలం మరియు శాంతికి మూలమని హామీ ఇస్తాడు.

నేనంటాను, దేవుడే మన ఆశ, మన ఓదార్పు మరియు మన బలానికి మూలం అని నేడు మనం నమ్మినప్పుడు మనం నిశ్చింతగా ఉండవచ్చు. జీవితం కష్టమైనా, భవిష్యత్తు అనిశ్చితమైనా మనల్ని ఆదుకునేది ఆయనే. మన భయాందోళనలను ఎదుర్కొనే ధైర్యాన్ని, తెలివైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆయనే మనకు సహించే శక్తిని మరియు ఆయనలో విశ్రాంతి తీసుకునేందుకు శాంతిని కూడా దయజేస్తాడు. మన విశ్వాసంలో స్థిరంగా నిలబడే ధైర్యాన్ని, బలాన్ని ఆయనే అందిస్తాడు. మన పోరాటాలను అధిగమించడానికి, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి మనకు శక్తిని ఇస్తాడు అనుటలో ఎట్టిసందేహం లేదు. ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమెన్. 


Telugu Audio:http://tempuri.org?link=new

Our Source of Strength 

Psalms 105:4 Look to the LORD and his strength; seek his face always.

  One day a boy was flying a kite, the wind was brisk, and the kite was soaring high in the sky. So high that the kite was hidden in large swirling clouds. When someone asked him how do you know if your kite is still behind the clouds? Boy replied, every little while I feel a tug as I hold on to the string. Similarly, when the clouds of uncertainty mask our lives, we should never tire to seek God and hold on to him. When we continue to look unto him, he gives us the tug in our heartstring, assuring us He is our source of strength and peace.

Today we can be rest assured that He is our source of hope, comfort, and strength. He is the one who will sustain us even when life is hard and an uncertain future. He is the one who gives us the courage to face our fears and the wisdom to make wise decisions. He is the one who will give us the strength to endure and the peace to rest in Him. He is the one who will provide us with the courage and strength to stand firm in our faith. He is the one who will give us the power to overcome our struggles and to live a life of purpose and meaning.  


English Audio: https://youtu.be/_g9TG26vAtM

Share this post