Skip to Content

మన అడుగుజాడలు | Walk the Talk

16 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

మన అడుగుజాడలు

ఫిలిప్పీయులకు 4:9 మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.

యేసు క్రీస్తును అనుసరిచే మన విశ్వాసానికి గూర్చిన జ్ఞానములో నిమగ్నమవ్వడం చాలా అరుదుగా ఉంటుంది, దానిని నిజంగా జీవించడంలో విఫలమవుతుంది. మనం తరచుగా చర్చికి హాజరవుతున్నప్పటికీ, ప్రసంగాలు వింటూ, బైబిలును అధ్యయనం చేస్తున్నప్పటికీ, మనం నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టకపోతే, వాటి యొక్క ప్రయోజనాన్ని కోల్పోతాము.

అపో. పౌలు, సువార్తను ప్రకటించడమే కాకుండా తన జీవితంలో కూడా దానిని ప్రదర్శించిన వ్యక్తికి గొప్ప ఉదాహరణ. వారు నేర్చుకున్న పాఠాల నుండి వారి ఆధ్యాత్మిక ప్రయాణాలలో తన అడుగుజాడలను అనుసరించాలని ఫ్జిలిప్పీ సంఘాన్ని ప్రోత్సహించాడు. ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపడం అంటే, ఒక వ్యక్తి తాను ఏదైతే మాట్లాడుతూ ఉన్నడో ఆ మాటపై కట్టుబడి జీవించాలి. ఉదాహరణకు ఇతరుల పట్ల ప్రేమ మరియు దయ చూపడం ద్వారా, మనకు అన్యాయం చేసిన వారిని క్షమించడం ద్వారా, నీతి నిజాయితీతో కూడిన జీవితాన్ని గడపడం ద్వారా ఋజువు చేయాలి. మనం క్రీస్తు బోధలను వింటూ, ఆచరిస్తున్నప్పుడు, దేవుని మార్గాలను అనుసరించడం వల్ల కలిగే శాంతిని మనం అనుభవిస్తాము. దేవుడు మనతో ఉన్నాడని మరియు అడుగడుగునా మార్గాన్ని నిర్దేశిస్తాడని మనకు తెలుసు కాబట్టి మనం భవిష్యత్తు గురించి చింతించము. కాబట్టి మనం క్రీస్తు నుండి నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టడానికి, ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపడానికి మరియు ఆయనను అనుసరించడం ద్వారా వచ్చే ఆనందం మరియు శాంతిని అనుభవించడానికి మనస్ఫూర్తిగా కృషి చేద్దాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/zutNDGKneuo

Walk the Talk Philippians 4:9 Whatever you have learned or received or heard from me, or seen in me--put it into practice. And the God of peace will be with you. It-s seldom easy to get engrossed in our faith-s knowledge and theory as followers of Christ, failing to genuinely live it out. Even though we frequently attend church, listen to sermons, and study the Bible, if we don-t put what we learn into practice, we are missing the purpose. The author of Philippians, Paul, is a great illustration of someone who not only preached the gospel but also demonstrated it in his own life. He exhorted the Philippians to follow in his footsteps in their spiritual journeys from the lessons they learned.  To live an exemplary life, one needs to walk the talk. By showing love and kindness to others, forgiving those who have wronged us, and living a life of integrity and honesty. As we hear and practice the teachings of Christ, we experience the peace that comes from following God-s ways. Then we do not worry about the future, as we know that God is with us and guiding every step. So let us make a conscious effort to put into practice the things we have learned from Christ, to live an exemplary life and experience the joy and peace that come from following Him. Amen.

English Audio: https://youtu.be/HATo0LHygaE

Share this post