- Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
- Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
- Reference: Sajeeva Vahini - Daily Devotion
అపారమైన ప్రేమ
హోషేయ 1:7 అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం దేవుని నుండి దూరమై, వారి తిరుగుబాటును బట్టి, దేవుని ఉగ్రతను గూర్చిన సందేశాన్ని ఒక ప్రవచానాత్మక తీర్పును దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. అయితే, దక్షిణ రాజ్యమైన యుదా పై దేవుడు తన కృప కనికర వాగ్ధానమును బయలుపరిచాడు.
ఆ వాగ్ధానము, వారిని తానే ఏర్పరచుకొని రక్షిస్తాడని ముందుగానే తెలియజేశాడు. మానవ శక్తి వంటి విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేత, అనగా దేవుడే తన స్వశక్తితో వారిని రక్షిస్తాడని వాగ్దానం చేశాడు. మన దేవుడు కృప మరియు దయగల దేవుడు, ఆయన మానవ అవగాహనకు వారి సామర్థ్యానికి మించిన మార్గాల్లో తన ప్రజలను రక్షించడానికి ఎంచుకున్నాడు.
ఈ రోజు మనం ఈ వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని కృప దయ ఎంత ప్రాముఖ్యమో అది మనకు గుర్తు చేస్తుంది. మనం కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆయన కృపకు దూరమయ్యాము. కానీ ఆయన యూదా ఇంటిపై దయ చూపినట్లే, యేసుక్రీస్తుపై విశ్వాసముంచడం ద్వారా మనకు రక్షణను బహుమతిగా దయజేసాడు.
ఈరోజు ఆయన ప్రేమ మరియు ఆయన వాగ్దానాల నిశ్చయతతో మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయజేయును గాక. ఆమెన్.
Telugu Audio: https://youtu.be/IvcpgYP5U3U
Unfathomed Mercy
Hosea 1:7 says, "But I will have mercy on the house of Judah, and I will save them by the Lord their God. I will not save them by bow, sword, battle, horses, or horsemen."
This verse comes during a prophetic message of judgment against Israel, specifically against the northern kingdom which had turned away from God and was facing the consequences of their rebellion. But even during this judgment, God shows his mercy and grace by promising to save the southern kingdom of Judah.
What-s remarkable about this promise is, the way in which God chooses to save his people. He explicitly states that He will not do it through human source of power or might such as bow, sword, battle, horses, or horsemen. Rather, He will save them by His divine power and intervention.
He is a God of mercy and grace, who chooses to save his people in ways that go beyond human understanding or capability.
As we reflect on this verse today, we are reminded of our own need for God-s mercy and grace. We too have rebelled against God and fallen short of His standards. But just as He showed mercy to the house of Judah, so he offers us the gift of salvation through faith in Jesus Christ.
May we live in the confidence of His love and the assurance of His promises today. Amen.
English Audio: https://youtu.be/Q6rM290WNas