Skip to Content

ఆధ్యాత్మిక ఉల్లాసం | Our Spiritual Refreshment

16 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vaahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 3
  • Reference: Sajeeva Vahini - Daily Devotion

ఆధ్యాత్మిక ఉల్లాసం

యెహెఙ్కేలు 47:9 వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.

ఈ నది దేవుని నుండి వచ్చే జీవజలానికి చిహ్నం. దేవుని జీవజలం కృప మరియు దయతో నిండి ఉంది అది మన జీవితాలకు ఆనందం మరియు శాంతిని దయజేస్తుంది. ఇది ఆధ్యాత్మిక ఉల్లాసానికి మూలం. అంతేకాదు, అది మన ఆత్మలను పునరుద్ధరిస్తుంది. ఈ జీవజలాన్ని మనం దేవుని వాక్యం నుండే కనుగొనవచ్చు. మనం బైబిల్ చదివినప్పుడు దేవుని సత్యం అనే నది నుండి లోతుగా త్రాగవచ్చు ఆయన ప్రేమ మరియు జ్ఞానంతో నింపబడవచ్చు. ప్రార్థనలో కూడా ఈ జీవజలాన్ని మనం కనుగొనవచ్చు. మనం ప్రార్థించినప్పుడు మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందగలము మరియు ఆయన తన కృపలో దయలో మనలను నింపుతాడు.

జీవజలనదియైన  దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన సమస్త జీవితాలకు మరియు సమస్త మంచి విషయాలకు మూలం, ఆయనే మనలను ఆదరించేవాడు. ఈ జీవజల నది దేవుని వద్దకు రావాలని మరియు ఆయనలో విశ్రాంతి మరియు పునరుద్ధరణను కనుగొనమని మనకు ఆహ్వానమిస్తుంది. దేవుని జీవజలానికి మన హృదయాలను మరియు మనస్సులను తెరుద్దాము అయన ప్రేమను మనలో నింపడానికి, మనలను ఉల్లసింప చేయడానికి ప్రయత్నిద్దాము. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/Vsme6TU009c

Our Spiritual Refreshment

Ezekiel 47:9 Swarms of living creatures will live wherever the river flows. There will be large numbers of fish, because this water flows there and makes the salt water fresh; so where the river flows everything will live.

This river is a symbol of the living water that comes from God. The living water of God is filled with grace and mercy and it brings joy and peace to our lives. It is the source of spiritual refreshment and it renews our souls. We can find this living water in the words of God. When we read the Bible we can drink deeply from the river of Gods truth and be filled with His love and wisdom. We can also find this living water in prayer. When we pray we can tap into the power of the Holy Spirit and He will fill us with His grace and guidance. The river of living water is a reminder that God is always with us. He is the source of all life and all good things, and He is the one who sustains us. This river of living water is an invitation to us to come to God and find rest and renewal in Him. We can drink deeply from the river of God’s love and be filled with His peace and joy. Let us open our hearts and minds to the living water of God and allow His love to fill us and refresh us. Amen.

English Audio: https://youtu.be/e7-3-MayqUs

Share this post