Skip to Content

స్వస్థపరచు దేవుడు

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

స్వస్థపరచు దేవుడు

నిర్గమ 15:26 ...నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే

కొంతమంది రోగం, సమస్యలు అనేవి పాపము వలన వస్తాయని, అలాంటి పరిస్థితులు ఎదుర్కొనేవారిని హీనముగా చూస్తుంటారు. కాని విశ్వాస జీవితములో ఎవరైన ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నాడంటే రాబోయే రోజులలో వారు భూమిని తలక్రిందులు చేయబోతున్నారని తెలుసుకోవాలి.

మనం చేసే విశ్వాస జీవిత ప్రయాణంలో సత్యంకంటే అసత్యమైనవే ఎక్కువగా వింటాము. ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించాలంటే వాక్య పరిశీలన చాలా అవసరం.

మనం చూసిన ఈ భాగంలో దేవుడు, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు రానియ్యనని చెప్పి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేనని తెలియజేసాడు. దేవుడు రోగము ఏదియు రానియ్యనని చెప్పి, ఒకవేళ ఏ రోగమైన వస్తే నిన్ను స్వస్థపరుస్తానని మాట ఇచ్చాడు. ఇందులో దేవుని ప్రేమ కనిపిస్తుంది.

ఈ రోజులలో ఎటు చూసిన వ్యాధులే, ఇంతకముందు మరణం ఎక్కడో వినిపించేది కాని ఇప్పుడు మన ఇళ్ళల్లో కనిపిస్తుంది. ఇంతకముందు వచ్చేవారం ఎక్కడ ఫంక్షన్ చేయ్యాలో ప్రణాళికలు వేసేవారము కాని, ఇప్పుడు ఎక్కడ నుండి దుర్వార్త వస్తుందోనని భయంతో రోజులు గడుస్తున్నాయి. సంతోషకరమైన వార్తలు తగ్గిపోయినవి.

ఏది ఎలా ఉన్నా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే వాగ్ధానము నేటికి సజీవముగానే ఉంది. దేవుని నుండి స్వస్థత కావలంటే ఏమి చేయ్యాలో ఈ వాక్య భాగంలో స్పష్టముగ వ్రాయబడినది. అదేమనగా - దేవుని వాక్కును శ్రద్ధగా విని, అనుసరించి నడచుకోవాలి. ఒక్క స్వస్థతే కాదు దేవుని దగ్గర నుండి ఏది కావాలన్నా ఇదొక్కటే మార్గం.

(యోహాను 11:21-27) చనిపోయిన లాజరు బ్రతుకుటకు అనేక కారణాలు ఉండొచ్చు కాని ఓకటి నిజం. అదేమనగా, మార్త దేవుని వాక్కును శ్రద్ధగా విని, నమ్మి, అనుసరించి. వాక్యముతో ఆ కుటుంబము కట్టబడినది కాబట్టే యేసు ఆ కుటుంబమును ప్రేమించాడు. వారి నమ్మకం దేవుని కదిలించింది కాబట్టే చచ్చినవాడిని బయటికి రమ్మని పిలువగా జీవం పొందుకొని భయటకు వచ్చాడు.

ప్రియ విశ్వాసి! ఎప్పుడైతే నీ ప్రవర్తన, నీ విశ్వాసం దేవుని కదిలిస్తుందో వెంటనే అద్భుత కార్యమును చూస్తావు. దేవుని హృదయమును కదిలించే విశ్వాసిగా నీవున్నావా ??

Telugu Audio: https://youtu.be/Ldi9nrsOb50

Share this post