Skip to Content

శ్రమలు ఎందుకు?

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

శ్రమలు ఎందుకు?

ఒక శాస్త్రవేత్త సీతాకోకచిలుకకి చెందిన ఒక ప్యూపాను దాదాపు సంవత్సరం పాటు దాచిపెట్టాడు. ప్యూపా చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అది కూజా ఆకారంలో ఉంటుంది. దాని మెడ దగ్గర చిన్న రంధ్రంగుండా లోపల తయారయిన కీటకం దానిని చీల్చుకొని తెలియకుండా బయటకి వెళ్ళిపోయింది. ఖాళీ ప్యూపాకీ , కీటకం లోపలే ఉన్న ప్యూపాకీ ఆకారంలో ఏమీ తేడా లేదు. ఆ రంధ్రం చుట్టూ ఉన్న సిల్కు దారాలు ఏమీ తెగిపోయినట్టుగాని, చెదరినట్టుగా లేవు కాని ఆ చిన్న రంధ్రంలో నుండే ఆ కీటకం వెళ్ళిపోయింది.

కీటకం సైజుకీ, ఆ రంధ్రానికి ఉన్న తేడాను బట్టి చూస్తే కీటకం పడే పాట్లు వర్ణించనలవి కాదు. జీవశాస్త్రజ్ఞులు కనుక్కున్నదేమిటంటే అంత చిన్నరంధ్రంలో నుండి దూరి బయటికి వస్తున్నప్పుడు ఆ వత్తిడికి ఆ కీటకం శరీరంలోని జీవద్రవాలు దాని రెక్కల్లోని నాళాల్లోకి వెళ్తాయట. ఎందుకంటే ఆ జాతికి చెందిన కీటకాల్లో అప్పటిదాకా రెక్కలు సరిగ్గా తయారు కావట. ఆ ద్రవాలు రెక్కల్లోకి ప్రవహించే దాకా ఆ రెక్కలు ఎగరడానికి పనికిరావట. ఏప్పుడైతే ప్యూపా ఆ చిన్న రంధ్రం గుండా కష్టపడుతు బయటికి వస్తుందో సంపూర్ణ స్థితికి చేరుకుంటుంది.

అలాగే నీవుకూడ శ్రమలలో నలుగుతూ వెళ్ళవలసినదే. ఈ శ్రమలగుండా ప్రయాణం కష్టముగానే ఉంటుంది కాని, సంపూర్ణ సిద్ధి కలుగజేస్తుంది

రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.

విశ్వాసములో ఎదగడానికి, క్రీస్తు స్వభావములోనికి మారడానికి ఈ లోకంలోని పద్దతులను అనుసరించకూడదని పౌలు చెప్తున్నాడు. అనగా లోకం ఎప్పుడు రెండ పడవల మీద ప్రయాణమే నేర్పిస్తుంది. దేవుడు కావాలి అలాగే లోకంలోనివి కూడా అనుభవించాలని నేర్పిస్తుంది. ఈ రెండు పడవల ప్రయాణం వలన దేవుని చిత్తమును తెలుసుకొనలేవు.

శ్రమలలో నలిగిపోతున్నావా? ఊపిరి ఆడడంలేదా? ఇంకెంత కాలం ఈ శ్రమలని నిరుత్సాహపడుతున్నావా? శ్రమలలో నలుగుతున్నప్పుడే నీలోన ప్రతి అవయవం క్రీస్తులోనికి రూపాంతరం చెందుతుంది. మనం శ్రమల మూలంగా మచ్చలేని వాళ్ళంగా అవుతాము. దేవుని పిల్లలు విధేయత అనే శిక్షణ పొంది, శ్రమల ద్వారా మహిమలోకి ప్రవేశిస్తారు.

Telugu Audio: https://www.youtube.com/watch?v=lGwNvbEg96s

Share this post