- Author: Anudina Vahini | Pas. Anil Andrewz | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
- Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
- Reference: Sajeeva Vahini
శ్రమ నుండి విడుదల
కీర్తన 40:1-5 యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
ఏదోక సమస్య ప్రతి ఇంట్లో ఉంది. ఒక ఇంట్లో కుటుంబం సమస్యలు. మరోక ఇంట్లో ఆర్ధిక సమస్యలు. ఇంకొక ఇంట్లో ఆరోగ్య సమస్యలు. వివాహాలు కావడంలేదని ఒకరు బాధపడుతుంటే, పిల్లలులేరని ఇంకొకరి బాధ. వేసుకున్న ప్రణాళికలన్ని కరోనా నాశనం చేసేసింది, అప్పులేనివారు కూడా అప్పులపాలైనారు. ఏది ఎలా ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా మనకు కావలసినవి దయచేయగల సమర్ధుడు మనం నమ్మిన యేసయ్య.
ఈ కీర్తన భాగంలో కీర్తనాకారుడు తన సమస్యలలో దేవునికి మొఱ్ఱపెట్టి సహాయము పొందుకున్నాడు. ఎలాంటి సమస్యలో ఉన్నాడంటే నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడు. ఇది ప్రతి విశ్వాసి యొక్క అనుభవం. ఇది భయంకరమైన కష్టం, అపాయం, దీనావస్థ అని చెప్పోచ్చు. జీవిత పునాదులే తలక్రిందులైనట్లు అనిపించే అనుభవం. ఇలాంటి పరిస్థితిలో నుండి కీర్తనాకారుడు భయటకు వచ్చాడు. దానికి కారణం ప్రార్థన ఒక్కటే కాదు ప్రార్థన చేసి సహనముతో ఎదురు చూసాడు.
ప్రస్తుత దినములలో ప్రతి విశ్వాసికి కావలసింది, ముఖ్యమైనది సహనం. సహనం చూపించుట అంటే దేవుని చిత్తమునకు సంపూర్ణముగా లోబడడం. దేవుడే నాకు సహాయము చేయగలడని దేవుని సహాయము కొరకు ఎదురుచూడడం. అబద్దములు చెప్పి మాయమాటలు చెప్పే వారి వెంట తిరుగకుండా దేవుని సహాయము కొరకే ఎదురుచూడడం.
ఈ రోజు నీవు కూడ ఈ కీర్తనాకారునివలే నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో ఉన్నావా? బయటకు వచ్చే అవకాశమే కనిపించుటలేదా? కాని, అద్భుతమైన విషయమేంటంటే లెక్కకు మించిన విస్తారమైన తలంపులు దేవుడు నీపట్ల కలిగివున్నాడు. ఈ రోజు అడుగు నిలుపుటకు కూడ స్థలం లేదోమో కాని సహనముతో ఎదురు చూస్తే, దేవుడు నిన్ను బండ మీద స్థిరపరుస్తాడు. నీ నోట క్రోత్త గీతమును ఉంచుతాడు.
Telugu Audio: https://youtu.be/tj0DkDLg88o?si=wxMzpCJ8rmll3G4r