Skip to Content

పగిలిన పాత్రలు

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

పగిలిన పాత్రలు

పగిలిన కుండలను బాగుచేయడమనేది దశాబ్దాల క్రితం జపాను దేశపు కళ. దానిని కిన్సూజి(Kintsugi) అంటారు. జిగురు కలిపిన బంగారు ఇసుకను, పగిలిన పాత్రల ముక్కలను తిరిగి అతికించడానికి ఉపయోగిస్తారు (golden repair). ఫలితంగా ఒక అందమైన బంధం ఏర్పడుతుంది. బాగుచేసిన ప్రాంతం కనిపించకుండ చేయాలని ప్రయత్నించడానికి బదులు ఆ పగిలిన స్థితినుండి ఈ కళ ఒక అద్భుతమైన స్థితికి తీసుకొని వస్తుంది. 

మనం చేసిన పాపానికి యదార్ధంగా పశ్చాత్తాపపడినప్పుడు, మన విరిగి నలిగిన స్థితిని దేవుడు గమనించి విలువనిస్తాడని పరిశుద్ద గ్రంథంలో ఒక సంఘటనను బట్టి అర్ధమవుతుంది. బెత్షేబాతో దావీదు పాలుపంచుకొని పాపము చేసి, ఆమె భర్త మరణానికి కుట్ర పనిన తరువాత, ప్రవక్తయైన నాతాను అతనిని అదుపులో ఉంచాడు. మనం పాపం చేసినప్పుడు ఎటువంటి వైఖరిని మననుండి ఎదురుచూస్తాడనే దాని గూర్చిన అవగాహన దావీదు ప్రార్ధనను బట్టి గమనించగలం. “నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును. దహనబలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవుని కిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” (కీర్తన 51:16-17). 

పాపం విషయంలో మన హృదయం బ్రద్దలై విరిగినప్పుడు, సిలువలో మన రక్షకుడు ధారాళంగా వెలకట్టలేని క్షమాపణ చేత దేవుడు దానిని బాగు చేస్తాడు. మనం ఆయన ముందు తగ్గించుకోన్నప్పుడు ఆయన ప్రేమతో మనలను స్వీకరిస్తాడు. దేవునికి మనకు మధ్య సాన్నిహిత్యం పునరుద్ధరించబడుతుంది. 

దేవుని కరుణ ఎంత గొప్పది కాదా! ఆయన ఆశించేది దీనమైన మన హృదయమే. అనుదినం దేవుడు మనకు దయజేసే తన అపారమైన ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యతతో అద్భుతమైన తన పాత్రగా మనలను సిద్ధపరచుకుంటాడు. ఆపాత్ర ఉపయోగకరంగా మారుతుంది.దావీదు చేసిన పార్ధన చేసుకుందాం: “దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము...నిత్యమార్గమున నన్ను నడిపింపుము.” (కీర్తన 139:23-24). అనుదినం నన్ను సరిచేస్తూ..నీ కొరకు ప్రయోజనకరమైన పాత్రగా చేయుము తండ్రీ. ఆమేన్.

Telugu Audio: https://www.youtube.com/watch?v=p5UUOZbskVo

Share this post