Skip to Content

మన పోలికలు!

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

మన పోలికలు!

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అనే మాట వింటూ ఉంటాం కదా. అది వాస్తమో కాదో నాకు తెలియదు గాని, ఎవరినైతే మనం అభిమానిస్తుంటామో వారిని పోలి నడుచుకుంటూ ఉండడం సహజం. ఒక ప్రఖ్యాతిగాంచిన గాయకుడిని అభిమానిస్తే అతనిలా పాడాలని, అటగాడిని అభిమానిస్తే ఆ వ్యక్తిలా నైపున్యతను ప్రదర్శించాలని, ప్రముఖ వ్యక్తులను అభిమానించి వారివాలే నడుచుకోవాలని – మనలో ఇటువంటి స్వభావం కలిగియుండడం వాస్తవమే కదా.

నేడు మనమొక ప్రశ్న వేసుకుందాం. మనము ఎవరిని పోలి ఉన్నాము? అలా ప్రశ్నించుకున్నప్పుడు అపో.పౌలు 2కొరింథీ 3:18లో వ్రాసిన విధంగా “మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము.”. మన జీవితాలలో ప్రభువైన యేసును మహిమపరలచాలని కొరుకొన్నప్పుడు ఆయన సారూప్యం గలిగి ఉండడం మన లక్ష్యాలలో ఒకటిగా ఉండాలి. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే - మనము ఏ విధంగా జీవిస్తున్నామో ఆ జీవితంలో క్రీస్తుకున్న లక్షణాలు కనుబరచడానికి ప్రయత్నించాలి. ఈ అనుభవం వ్యక్తిగతంగా మనం సాధించలేము గాని కేవలం పరిశుద్దాత్న వలననే సాధ్యం. క్రీస్తును అనుకరించడం అనుటకు ఉదాహరణ -  వైఖరిలో దీనత్వము కలిగి, స్వభావంలో ప్రేమను చూపిస్తూ, విధేయత మరియు ఒదిగి ఉండే గుణం కలిగి ఉండడం అనగా క్రీస్తుయేసునకు కలిగిన మనస్సు కలిగియుండడం.

మన ప్రభువైన యేసు పై దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఆయన పోలికలో మార్చబడి; మన క్రియలను, అలవాట్లను పోలికలను గమనిస్తున్న ఇతరులు మన ద్వారా క్రీస్తును కనుగొంటారు అనుటలో గొప్ప అనుభవం దాగి ఉంది. బైబిలులోని నాలుగు సువార్తలు క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటిస్తే; ఆయన పోలికలో నడుచుకున్న మన జీవితం క్రీస్తు సువార్త పరిమళాలను వెదజల్లే అయిదవ సువార్త గా మార్చబడుతుంది. అట్టి అనుభవం ప్రభువు మనందరికీ దయజేయును గాక. ఆమెన్.

Telugu Audio: https://www.youtube.com/watch?v=4Hw3Nr9iVHA

Share this post