Skip to Content

మీరు ఆశీర్వాదంగా ఉండడానికే ఆశీర్వదించబడ్డారు

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

మీరు ఆశీర్వాదంగా ఉండడానికే ఆశీర్వదించబడ్డారు

యెషయా 61:6 మీరు యెహోవాకు యాజకులనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు

యేసు సిలువపై మరణించినప్పుడు, మునుపెన్నడూ అనుమతి లేక దేవునికి మానవునికి అడ్డుగా ఉన్న, అతి పరిశుద్ధ స్థలం యొక్క తెర పైనుండి క్రిందికి చిరిగిపోయింది. ఇప్పుడు మనం ధైర్యంగా మన తండ్రిని స్తుతించడానికి, ఆరాధించడానికి, మరియు మహిమపరచడానికి తెరలోపలికి ప్రవేశించవచ్చు. ఈ అవకాశం మనం ఉచితంగా పొందుకున్నాం అని గ్రహించాలి.

దేవుని  ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్న మీరు ఇప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రార్థన, విశ్వాసం, ఆశీర్వాదం ద్వారా, మీరు మీ కోసం, మీ కుటుంబం మరియు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు.  అనేక సంవత్సరాల నుండి బంధకాల్లో ఉన్నవారిని విడిపించే సాధనంగా మరల్చబడ్డారు . మీరు ఇప్పుడు ఇతరులను ఆశీర్వదించవచ్చు, వారికి దేవుని గూర్చిన పరిచర్య చేయవచ్చు, తద్వారా దేవుడు వారిని  మీద్వారా రక్షించ గలడు, ప్రేమించగలడు మరియు సమాధానపరచగలడు.

మీరు అనేకులకు ఆశీర్వాదంగా ఉండటానికి ఆశీర్వదించబడ్డారు. ఆయన మహిమగల ఆశీర్వాదాలను మీ ద్వారా ఇతరులకు ప్రవహించనివ్వండి. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/claSW5MU8eM

Share this post