- Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
- Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
- Reference: Sajeeva Vahini
మీ హృదయమును కలవరపడనియ్యకుడి
కష్ట సమయాలు ఎల్లప్పుడూ జీవితంలో ఒక పెద్ద నష్టం లేదా విపత్తు పరిణామాలుగా ఎంచవలసిన అవసరం లేదు. ఇవి చాలా చిన్నవి కూడా కావచ్చు, నిర్ణయం తీసుకోవడంలో కష్టం కావచ్చు, జీవితంలో మార్పులకు అనుగుణంగా మారడం కష్టం కావచ్చు లేదా ఉద్దేశ్యంతో నడిచే జీవితం కోసం దేవుని సూచనలను ప్రణాలికలను అనుసరించడానికి కష్టతరమవ్వచ్చు.
అన్ని పరిస్థితులలో మనకు నెమ్మది లేదా శాంతి అవసరం, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి లేదా దేనినైన క్రమంగా అనుసరించడం ద్వారా లేదా మన విధేయత ద్వారా కూడా పొందుకోవచ్చు. అయితే, మనకు అవసరమైనది దేవుని సహాయంతో చేసినప్పుడు మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడు ఈ శాంతిని కలిగి ఉండటానికి సహాయం చేస్తాడు.
యోహాను 14: 27 శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.
దేవుడు మనకు ఒక హెచ్చరికతో కూడిన పరిష్కార మర్గ్నాన్ని తెలియజేస్తూ, అదే సమయంలో మనకు భరోసా కూడా ఇస్తున్నాడు, ఆయన నుండి వచ్చే శాంతి మాత్రమే మనకు విశ్రాంతిని ఇస్తుందని, ఇది మన ఆందోళనలన్నింటినుండి విడుదల కలుగజేసి నెమ్మదిని దయజేస్తుందని గ్రహించగలం.
ఏదైనా సులభంగా దొరికే ఈ ప్రపంచంలో, మనం లోకసంబంధమైన మార్గాన్ని ఎంచుకోవడం కంటే శాంతిని కలిగి ఉండే దేవుని మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ లోక మార్గం ఎల్లప్పుడూ మనల్ని అశాంతి అసంతృప్తి స్థితిలో వదిలివేస్తుంది, మరోవైపు, దేవుని మార్గం మనల్ని ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించడానికి మరియు అతని శాంతిలో నివసించడానికి అనుమతిస్తుంది. ఆమెన్.
Telugu Audio: https://youtu.be/Cw4jIXTpNi0?feature=shared