Skip to Content

క్రీస్తుతో మనం దేవునికిసజీవయాగంగా సమర్పించుకోవాలి

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

సజీవయాగం

నేను కాలేజి చదువుకుంటున్న రోజుల్లో అత్యాధునికంగా విడుదలవుతున్న కొత్త కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని ఆలోచించాను. ఇటువంటి కోర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే వారిని కలిసి, కొంత సమయం వారి శిక్షణలో నేర్చుకుంటే రాబోయే దినాల్లో కొంతైనా ఉపయోగకరంగా ఉంటుందని భావించాను. అయితే నాకు తెలిసి తెలియని జ్ఞానంతో కాక మరియు నేను స్వతహాగా నేర్చుకోవడం కంటే, నైపుణ్యత కలిగిన శిక్షకుని సూచనలను పాటించి, అతడు నన్ను ఏమి అడిగితే అది చేయులాగున నన్ను నేను పూర్తిగా సమర్పించుకోవాలని ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకున్నాను. రోజు రోజుకి క్రొత్త సంగతులను నేర్చుకొని, నాలో నేను ఆత్మా విశ్వాసాన్ని బలపరచుకోవడం మొదలు పెట్టాను. అంతేకాదు, నాలోని అభివృద్ధి ఎన్నుకున్న శిక్షకుని దృష్టిలో చాలినంత నమ్మకాన్ని పొంచుకోగాలిగాను.

అపో. పౌలు ఇటువంటి అనుభవాన్ని క్రైస్తవ విశ్వాసంలో మన శిక్షకుడైన యేసు క్రీస్తుతో ఎలా ఉండాలని రోమా సంఘానికి వ్రాస్తూ రోమా 12:1 “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.”. 

దేవుడు, మనలను సంసిద్దులనుగా చేయడంలో చేయలేనిదానిని చెయ్యడానికి అయన ఎన్నడు పిలువడు గాని (రోమా 12:6) మన కనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై యున్నామని గ్రహించిన మనం, మనలను సృష్టించిన సృష్టికర్తకు మనలను గూర్చి మన కంటే ఆయనకే బాగా తెలుసు అని గ్రహించినప్పుడు, విశ్వాసంలో బలపరచబడి, దేవుని హస్తాల్లోనికి సజీవయాగ సమర్పణ కలిగి జీవించేవారమవుతాము. 

నేనంటాను, క్రీస్తుతో మనం దేవునికి “సజీవయాగంగా’ సమర్పించుకోవాలి అంటే “నేను నిన్ను సంపూర్ణంగా నమ్ముతున్నాను. నీవు నన్ను ఏది చేయమని ఆడిగితే దానికి నేను సంసిద్ధుడను” అని చెప్పగలిగినప్పుడు, దేవుడు తనకు ఇష్టమైన స్వారూప్యములోనికి మనలను మార్చుకోగలడని గ్రహించాలి. క్రీస్తులో...అట్టి సమర్పణ కలిగి జీవంచే ప్రయత్నం చేద్దామా!. ఆమెన్

Telugu Audio: https://youtu.be/9pmrelOhbsU?si=hlBls03xZ4noh7Mu

Share this post