Skip to Content

ఏదో ఒక రోజు మనం అర్థం చేసుకుంటాం

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

ఏదో ఒక రోజు మనం అర్థం చేసుకుంటాం

యోహాను 13:7అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా

జీవితంలో జరిగే ప్రతీ విషయం ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి మనయెడల ఒక ప్రణాళిక ఉందని మరియు ఆయన మన మంచి కోసం ప్రతిదీ చేస్తున్నాడని మనం విశ్వసించవచ్చు. మనం పరిస్థితులను అర్థం చేసుకోలేనప్పుడు కూడా ఆయనపై విశ్వాసముంచమని యేసు క్రీస్తు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఏమి చేస్తున్నాడో ఆయనకు తెలుసునని మరియు మన కోసం ఒక ఖచ్చితమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని ఈరోజు మనం సంపూర్ణంగా విశ్వసించవచ్చు. 

ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడనీ, మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడనీ మరచిపోవద్దు. దేవుడు ఎల్లప్పుడూ ఒక నిర్దిష్టమైన నియంత్రణ కలిగి ఉంటాడని ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడని గ్రహించినప్పుడు మనం గొప్ప ఆదరణ పొందవచ్చు. దేవుని ప్రణాళికలు నేడు మనకు అర్ధం కాకపోయినా, భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఖచ్చితంగా నెరవేరుతుందని సంపూర్ణంగా విశ్వసిద్దాం. అట్టి మనసు ప్రభువు మనందరికీ దయజేయును గాక.  ఆమెన్.

Telugu Audio: https://youtu.be/FLD4W4vXBoY

Share this post