- Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
- Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
- Reference: Sajeeva Vahini
దేవుడే మీ గురువైతే?
దేవుని ప్రణాళికలు మన వ్యక్తిగత ప్రణాళికల కంటే ఉన్నతమైనవని మనందరికీ తెలుసు. ఆయన ప్రణాలికలు మనల్ని అభివృద్ధిపరచి మనకు నిరీక్షణను కలుగజేస్తుంది.
చాలా సార్లు మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోయినప్పుడు మనం భయాందోళనలకు గురవుతాము. సమస్య యొక్క మూల కారణాన్ని లేదా విఫలమైన ప్రణాళికలను విశ్లేషించడానికి అర్థం చేసుకోవడానికి మరొకసారి వెనుకకు తిరిగి చూస్తాము. అయితే, దేవుడే మనకు సరైనదానిని బోధించినప్పుడు, అదిఉత్తమమైన మార్గం అని గ్రహించాలి. ఆయన నిర్దేశించిన మార్గంలో పనులు చేయగలిగితే మనం దేనిని ఎదుర్కొన్నా, ఆయన ఆత్మ మనల్ని సురక్షితమైన అగమ్యగోచరము కాని గమ్యానికి చేరుస్తుంది.
కీర్తనాకారుడు ఇదే విధంగా ప్రాధేయపడుతున్నాడు కీర్తనలు 143:10 నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక.
నేనంటాను, విఫలమవ్వని దేవుని ప్రేమపై మన నిరీక్షణ ఆధార పడగలిగితే, మన జీవితాలను ఆయనకు అప్పగించుకోవడమే కాకుండా మన ప్రణాళికలను ఆయన శక్తివంతమైన చేతులను పట్టుకొని ముందుకు కొనసాగిస్తాము.
మన సృష్టికర్తను సంపూర్ణంగా తెలుసుకొని, ఎన్నడూ మారని ఆయన వాక్యం ద్వారానే మనం జీవిస్తున్నమని గ్రహించి, ఆత్మతో నడిపించబడిన మనలో ప్రతి ఒక్కరి కోసం ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన ప్రణాళికలను విశ్వసించి, అడుగులు ముందుకు వేయగలిగితే ఎంత బాగుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఆమెన్.
Telugu Audio: https://youtu.be/fqn4BR1FlNg