Skip to Content

అవసరమా? కోరికా?

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi |
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

అవసరమా? కోరికా? 

విలాసవంతమైన జీవితాన్ని జీవించే ఒక రాజు ఉండేవాడు. తన జీవితంలో ఆ రాజు సంతోషం లేదా సంతృప్తి చెందలేకపోయాడు. ఒకరోజు తన సేవకుడు ఆనందంగా పాటలు పాడుతూ పని చేయడం చూశాడు. ఆ రాజు తన సేవకుడు ఎలా సంతోషంగా జీవుస్తున్నాడో అడిగి తెలుసుకున్నాడు. ఆ సేవకుడు ఇలా సమాధానమిచ్చాడు, "నేను సేవకుడిని తప్ప మరొకటి కాదు, నా కుటుంబానికి నాకు మించిన అవసరతలు లేవు ,ఉండడానికి ఇల్లు కడుపు నిండా భోజనం ఉంది" అని సెలవిచ్చాడు.

  ఆ సమాధానంతో రాజు ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి తన సేవకుడిని పరీక్షిస్తూ, రాజు రహస్యంగా 99 బంగారు నాణాల సంచిని తన సేవకుడి గుమ్మం వద్ద వదలమని తన పనివారిని ఆదేశించాడు. గుమ్మము వద్ద సంచిని చూసిన ఆ సేవకుడు తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ సంచిని తెరిచి ఆశ్చర్యపోయిన అతడు, వాటిని లెక్కించడం ప్రారంభించాడు. 99 నాణేలే ఉన్నాయని నిర్ధారించుకొని, “ఆ ఒక్క బంగారు నాణెం ఏమైయ్యుంటుంది? ఖచ్చితంగా, ఎవరూ 99 నాణాలను వదిలిపెట్టరే! ” అనుకొని, తనకు వీలైన ప్రతిచోటా వెతికాడు, చివరి ఆ ఒక్క నాణెం దొరకలేకపోయింది. చివరగా, నిరాశతో అలసిపోయిన అతడు ఆ ఒక్క బంగారు నాణెం సంపాదించడానికి తన సేకరణను సంపూర్తి చేయడానికి గతంలో కంటే ఎక్కువ కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుండి, 100వ బంగారు నాణెం సంపాదించాలనే తపనలో, తనను సహకరించే కుటుంబాన్ని స్నేహితులను కూడా దూషించడం మొదలుపెట్టాడు, పని చేస్తున్నప్పుడు పాటలు పాడటం కూడా మానేశాడు.

 సామెతలు 11:23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది.

చిన్న చిన్న విషయాలలో కూడా మనం సంతోషంగా ఉండగలం. కానీ మన జీవితంలో ఏదైనా పెద్దది లేదా మెరుగైనది పొందుకున్న సమయంలో, దానికంటే ఇంకా ఎక్కువ పొందుకోవాలనే తపన మొదలవుతుంది!. దాని ద్వారా, మనం మన నిద్రను, మన ఆనందాన్ని కోల్పోతాము, మన చుట్టూ ఉన్న వ్యక్తులను బాధిస్తాము, ఇవన్నీ మనలో పెరుగుతున్న అవసరాలు, మించిన కోరికలే. మనకున్నదానిలో సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి మన అవసరాలను కోరికలను సమతుల్యం చేసుకోవడం నేర్చుకోవాలి.  ఈ రోజు నుండి మనం ఒక మెరుగైన జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం! దేవుని కృప మనందరితో ఉండునుగాక. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/99iRvp-6EhQ

Share this post