Skip to Content

అత్యుత్తమమైన దేవుని చిత్తము

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

అత్యుత్తమమైన దేవుని చిత్తము

దేవుని వాగ్దానములెప్పుడూ మనుష్యుల జ్ఞానము కంటే ఘనమైనవిగా ఉంటాయి. వ్యక్తిగతంగా మనం సాధించాము అనుకున్న మన విజయాలన్నీ మన వ్యక్తిగత సాధన వలన కలిగినవి కానే కాదు, అవన్నీ ఉచితంగా దేవుడు మనకు దయజేసిన బహుమానాలేనని జ్ఞాపకము చేసుకోవాలి. ”నేను చేయలేను”, “నేను అర్హుడను కాను”, “ఈ సమస్యను నేను ఎదుర్కోగాలనా?” వంటి బలహీనతలు మరియు సందేహాలు మనలను క్రుంగదీసినప్పుడల్లా, ఒక్క క్షణం ఆలోచనచేసి మనం ఆధారపడిన దేవునిపై దృష్టి సారిస్తే ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ఎందుకంటే, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగిన దేవుని మనము సేవించుచున్నాము కాబట్టి.  మన ఆలోచనలకు పరిమితులు ఉంటాయి కానీ ఆయనకు ఎటువంటి పరిమితులు ఉండవు. ఆయన తన చిత్తాన్ని మనకు సిద్ధింపజేసి దాని విషయమై అనుదినం ఆనందిస్తాడు. సందేహాన్ని కలిగియున్నంత మాత్రాన విశ్వాస జీవితానికి మనము అసమర్థులము కానేరము. అయితే, దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఎల్లప్పుడూ ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూనే ఉంటాడు. గనుక ఆయన యొక్క వాగ్దానములందు నమ్మికయుంచి, ఆయనను మహిమపరచి, ఆయన యొక్క పనిలో పాలివారమవుటకు ప్రయత్నిద్దాం. 

మార్కు 14:36- “నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము.” అనే ప్రార్ధన మనం చేయగలిగితే వాగ్దానాలతో కూడిన దేవుని చిత్తాన్ని మన జీవితంలో సంపూర్ణమైన ఫలితాలుగా చూడగలం.

Telugu Audio: https://youtu.be/8nvC4ylYtLQ?feature=shared

Share this post