Skip to Content

అనుభవజ్ఞానం

  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

అనుభవజ్ఞానం

దేవుని పరిచర్య చేయడానికి మనకెన్నో అవకాశాలు వస్తుంటాయి. వ్యక్తిగతంగా నా అనుభవాన్ని వివరించాలంటే. వాక్య పరిచర్య చేయడానికి, బైబిల్ స్టడీ, యవనస్తుల పరిచర్య వంటి ఎన్నో పరిచర్యల్లో పాలుపొందడానికి అవకాశాలు వచ్చిన ప్రతి సారి, నాకు నిజంగా అంతటి అర్హత ఉందా అని తరచూ అనుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు, ఈ పరిచర్య నా సామర్ధ్యానికి మించినది అని అనిపిస్తుంది. పెతురులా నేను నేర్చుకోవలసినది చాలా ఉంది. 

ప్రభువును వెంబడిస్తున్నప్పుడు పేతురు యొక్క లోపాలను జ్ఞాపకము చేసుకుంటే...నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు మునిగిపోసాగాడు. యేసు క్రీస్తును బంధించినప్పుడు - ఆయనను ఎరగనని ఒట్టు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే పునరుత్థానుడైన యేసును చూశాడో అప్పుడే తన జీవితం మారిపోయింది. దేవునిలో అనుభావజ్ఞాన్నాన్ని పొందిన పేతురు అంటున్నాడు “తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.” (2 పేతురు 1:2,4).

ప్రభువైన యేసు క్రీస్తుతో మన సంబంధం దేవుని ఘనపరచడానికి, ఇతరులకు సహాయం చేయడానికి, నేటి సవాళ్ళను ఎదుర్కోడానికి కావలసిన జ్ఞానాన్ని, ఓర్పును, శక్తిని పొందుటకు మూలమైయున్నది. ఆయన ద్వారా సంశయాలను, చాలని వారమన్న భావనలను కూడా అధిగమించగలం. ప్రతి పరిస్థితిలో ఆయనను సేవించి, ఘనపరచడానికి అవసరమైన ప్రతిదానిని మనకు దయజేశాడు. ఈ గొప్ప అనుభవాన్ని పొందడానికి ప్రయత్నిద్దామా!. ఆమెన్

Telugu Audio: https://www.youtube.com/watch?v=zNUPbY5G38k

Share this post