- Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
- Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
- Reference: Sajeeva Vahini
ఆహ్వానం
ప్రకటన గ్రంథం 22:17 ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.
మనిషిగా ఉండడం అంటే కోరికలు కలిగి ఉండడం. మన ప్రాథమిక కోరికలు గాలి, నీరు, ఆహారం, ఆశ్రయం మొదలైన శరీర అవసరాలు. ఈ అవసరాలను తీర్చకపోతే మనం మనుగడ సాగించలేము కదా. మన దైనందిన జీవితాన్ని నడిపించడానికి దేవుడే ఈ కోరికలను ఏర్పాటు చేశాడు. అలాగే మన ఆత్మకు కూడా కోరికలు ఉంటాయి. ఇతరులతో సహవాసం కలిగియుండి, ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం మొదలగునవి. మనం దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఆత్మ జీవులం కాబట్టి, మన ఆత్మకు కోరిక ఉంది - ఆ కోరిక ఒకే ఒక్క విషయంలో నెరవేరుతుంది,అది దేవునితో సన్నిహిత సహవాసం. సమస్య ఏమిటంటే, పాపం అనునది దేవుడు మరియు మనిషి మధ్య సహవాసాన్ని అడ్డుకుంది. ప్రజలు తమ శరీరం ఆత్మ యొక్క అవసరాలను తీర్చుకుంటూ జీవితమంతా గడుపుతారు. దేవుని పట్ల వారి ఆత్మ యొక్క కోరిక నెరవేరని కారణంగా వారు సంతృప్తి చెందలేరు.
అవును, ఎవరైతే సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలనుకుంటున్నారో, వారికి దేవుడు ఒక ఆహ్వాన్నాన్ని ఇస్తున్నాడు. ఈ ఆహ్వానం 2,000 సంవత్సరాల నాటిది, అయినప్పటికీ అది నేటికీ ఉంది. ప్రశ్న ఏమిటంటే, మీరు ఎప్పుడైనా యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనుభూతిని పొందారా? మీరు సువార్త సందేశాన్ని విన్నారా? మీకు యేసు క్రీస్తు అవసరం ఉందంటారా? మీరు విశ్వాసం ద్వారా ఉచితంగా పరలోకాన్ని పొందగలరా? దేవుడు నీ కొరకు తన కుమారుని ఇచ్చుటకు నిన్ను ప్రేమించాడు. అట్టి రక్షణను నిర్లక్షం చేయకుండా ఆయన తన ఆహ్వానంతో మనకు అనుగ్రహించే ఆ ఉచితమైన బహుమానాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దాం. ఆమెన్
Telugu Audio: https://youtu.be/oRCTvOIdA4M