Skip to Content

ఆదరణ

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

ఆదరణ

కొందరు స్నేహితులందరు కలిసి బహుమానంగా ఒక గాజు పాత్రలను పోస్టు ద్వారా పంపించారు. అనుకోని రీతిలో ఖరీదైన ఆ పాత్ర  రవాణాలో పగిలిపోయినట్లు నేను గమనించాను. వాటిల్లో ఒక కప్పు పగిలిపోయి ఎన్నో ముక్కల్లా, పెంకుల్లా, గందరగోళంగా అయ్యింది. విరిగిన ఆ ముక్కలన్నీ తిరిగి సమకూర్చిన తరువాత, అతుకులు మరియు మచ్చలు ఉన్నప్పటికీ అందంగా కనబడింది. తిరిగి సమకూర్చబడిన ఆ పాత్ర నాకో సందేశాన్నిచ్చింది. దేవుడు నన్ను కష్టపరిస్థితిలోనుండి తీసుకువెళ్ళిన తరువాత ముక్కలైననూ, కూర్చబడినా ఆ పాత్రవలే నేను కూడా గట్టిగా నిలబడగలనని ఋజువు చేసే మచ్చలు నాకున్నాయి. నా జీవితంలో, జీవితము ద్వారా ప్రభువు ఎలా సహాయం చేశాడో అన్నది, ఇతరులకు వారి కష్టసమయాల్లో సహాయపడగలదని ఆదరణ నిచ్చే ఆ పాత్ర నాకు గుర్తు చేసింది.

కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక (2 కొరింథీ 1:3) అని అపో.పౌలు దేవుణ్ణి స్తుతించడం గమనించగలం. మన పరీక్షలను, శ్రమలను ఇంకా మనలను ఆయనలా చెయ్యడానికి దేవుడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. మన కష్ట సమయాల్లో ఆయన మనలను ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో, అలాగే మనకిచ్చే ఆదరణ ఎలాంటి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు మనలను సంసిద్ధులని చేసి ప్రోత్సాహిస్తుంది.

క్రీస్తు శ్రమలను గూర్చి ఆలోచించినప్పుడు, దేవుడు మనలను - “ఇతరులను బలపరచడానికి మన అనుభవాలను వాడుకుంటాడు” అని విశ్వసిస్తూ, మన శ్రమలను ఓపికతో సహించడానికి ప్రేరణ కలుగుతుంది. దేవుడు తన మహిమ కొరకు, శ్రమల నుండి మనలను విడిపిస్తాడని ఎరుగుటలో పౌలువలె ఆదరణను పొందవచ్చు.  ఈ ఆదరణ ఇతరులను ఆదరించగలమని రూఢిపరచగలిగే నిరీక్షణను కలిగజేస్తుంది. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/kB0kr1D4FFI?feature=shared

Share this post