Skip to Content

ఆదరించు దేవుడు.

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

ఆదరించు దేవుడు

కీర్తనల గ్రంథము 146:7బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదలచేయును. 

కటిక బాధల్లో, శ్రమలు, కష్టాలలో, అవసరంలో ఉన్న వారి పట్ల దేవుడు శ్రద్ధ వహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన దయగలవాడు, మరియు ఆయన ఎల్లప్పుడూ బలహీనంగా ఉన్నవారిని బలపరచే దేవుడు. తమ కోసం పోరాడలేని వారి కోసం దేవుడు ఎప్పుడూ పోరాడుతున్నాడని గ్రహించినప్పుడు మనం ఓదార్పు పొందవచ్చు. 

ఈరోజు, అలసిపోయి నీరసించిన వారి అవసరాల గురించి మాత్రమే కాకుండా, వారి ఆధ్యాత్మిక అవసరాల గురించి కూడా శ్రద్ధ వహిస్తున్నాడని గ్రహించాలి. అన్యాయానికి గురైన వారిని అణచివేతకు గురైన వారిని క్షమించడానికి పునరుద్ధరించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం విశ్వసించే దేవుడు కృపగలవాడు, దయగలవాడు. కాబట్టి, అవసరమైన వారికి తన కరుణను ప్రేమ చూపించడానికి ఎల్లప్పుడూ  సిద్ధంగా ఉన్నాడు. 

మనం కూడా ఇటువంటి వారికోసం అనుదినం ప్రార్దిస్తూ ఉండాలి. ఆధ్యాత్మికంగా భౌతికంగా అవసరమైన వారికి కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మన సమయాన్ని, శక్తిని, వనరులను అవసరమైన వారికి ఇవ్వడానికి ప్రయత్నించాలి. మనం కూడా క్రీస్తు వలే అట్టి మనసు కలిగియుండేలా ప్రయత్నించాలి. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/A5scXyaRxIo

Share this post