Skip to Content

వివక్షత ఎదురైనా విజయోత్సవమే

  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

వివక్షత ఎదురైనా విజయోత్సవమే

మనోభావాలు దెబ్బతిన్నాయనుకున్నప్పుడు, గాయపడినప్పుడు, ప్రేమించినది, అతిగా ప్రేమించినది పోగొట్టుకున్నప్పుడు దుఃఖము కలుగుతుంది. మనం నడుస్తున్న దారిలో, జీవితంలో ప్రేమకు రెక్కలు తొడిగి ఎగరగలినంతమేరా ప్రేమను పంచాలనుకుని విస్తరించే ఆత్మీయత, అనుబంధాలమధ్య వేలెత్తిచూపబడినప్పుడు కులం పేరిట, మతం పేరిట, వర్గ వివక్షతను పొందినప్పుడు గాయపడుతుంటాము. శరీరానికి కలిగేగాయలు, నొప్పి తాత్కాలికమైనదే, గానీ వర్గవివక్షత జీవితమంతా వెంటాడుతుంది. యోహాను 8:15 “మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను”. యుదా 1:19 “అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మ లేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు”.

వివక్షత వలన హృదయం బ్రద్దలై ధుఃఖాన్ని కన్నీరుగా ప్రదర్శిస్తుంటాము. దుఃఖము ఓటమికి అనుసంధానము చేస్తుంది. నిరుత్సాహముతో వున్నవారు హెచ్చింపబడలేరు. ఇదిలా ఉంటె, అసహనాన్ని ప్రదర్శించే ధిక్కారస్వరాన్ని అణచివేసే అధికారల ముందు బలహీనుడు నలిగిపోవాల్సిందే. బహిరంగంగా ప్రదర్శించబడుతున్న వివక్షత అనాగరికమైనదా? ప్రజాస్వామ్యవ్యవస్థ సక్రమంగా పనిచేయటం లేదా? ఇటువంటి ప్రశ్నల సందిగ్ధంలో నేడు మనం ఉన్నాఈ వివక్ష ఆనాడు యేసు క్రీస్తుకు తప్పలేదు అది చివరికి సిలువవైపు నడిపింది. సిలువలో ధర్మసాస్త్ర సంబంధమైన ప్రతివాటిని మేకులతో కొట్టబడి ఒక నూతన నిబంధనలోనికి మనలను నడిపించాడు. ఇక దుఃఖము ఎందుకుంటుంది? క్రీస్తులో మనకు ఓదార్పు తప్ప!

లూకా 19:9 లో యేసు ప్రభువు ఆనాడు జక్కయ్యతో అన్న మాటలు నేడు మనతో కూడా అంటున్నాడు “అందుకు యేసు ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.”. క్రీస్తు పుట్టుక నుండి సిలువ మరణం వరకు మనకెన్నో పాఠాలను నేరించిన తన జీవన ప్రస్తానంలో హద్దులు ఎరుగని ప్రేమ, ఐక్యత నిండిన భావాలు, సమతామమతల విలువలు, కులమతాలను కూలద్రోలి, ధనదాహాలను పారద్రోలి, ద్వేషాలను తరిమికొట్టి, స్వార్ధాలను పాతిపెట్టి, అసూయలను అంతం చేసింది. పరుల కష్టాన్ని చలించని సహోదర ప్రేమను చాటించి, క్షమాగుణాలను అనుసరించమని నేర్పిస్తూ, భేదం లేని పంచభూతాల్లా, స్వార్దం లేని సూర్య చంద్రుల్లా మనకు స్పూర్తినిచ్చి, వివక్షత లేని ప్రకృతిలా, విలువలను నేర్పిస్తూ విలువైన ఆశయాలతో మన జీవితాలను క్రీస్తులో విజయవంతులను చేసింది. హల్లెలూయ. వివక్షతను వ్యతిరేకించి, మానవత్వం వికసిస్తూ, మంచితనాన్ని పరిమళించే మన విశ్వాస జీవితాల్లో ఎల్లపుడు ఆశీర్వాదాలే. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/zscxGY_4c7M 


Share this post