Skip to Content

విమోచకుడైన దేవుడు

  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

విమోచకుడైన దేవుడు

యెషయా 44:23 - యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా, ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా, ఆర్భాటము చేయుడి పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును.

దాదాపు 430 సంవత్సరాల బానిసత్వం తర్వాత ఇశ్రాయేలీయులు దేవుణ్ణి తమ విమోచకునిగా తెలుసుకున్నారువారు బానిసత్వం నుండి విముక్తి పొందడమే కాకుండా దేవుడు ఇశ్రాయేలీయులను తరతరాలుగా ఆశీర్వదించాడుఅందుకే దేవుడు -  అబ్రాహాము దేవుడుఇస్సాకు దేవుడు మరియు యాకోబు దేవుడు అని పిలవబడటం మనం చూస్తాము.

ఏ తరంలోనైనా, మనం పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుడు మన పాపాలను క్షమించి, మన ద్వారా తన మహిమను వెల్లడిచేస్తాడు. ఆయనే మన విమోచకుడు. మన విమోచకుడైన దేవుడు మన ద్వారా జీవిస్తున్నాడు. దేవుడు ఎవరిని విమోచించాడో, వారికి తన ఆత్మను అనుగ్రహించాడు; అంతేకాదు నీరు పోసినట్లు వారిపై తన ఆత్మను కుమ్మరించాడు.

దేవుడు తన ఆత్మను మాత్రమే కుమ్మరించదలచుకోలేదు కాని, దేవుడు తన ఆశీర్వాదాన్ని మనపై మరియు రాబోయే తర తరముల మీద కుమ్మరించాలనుకుంటున్నాడు. ఆయనే యాకోబు దేవుడని, మన దేవుడని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలని, ఈ రోజు ఆయనను మన విమోచకునిగా ఆహ్వానించమని కోరుతున్నాడు. ఆమెన్.


Telugu Audio: https://youtu.be/3xQ1hZd8PZU 

Share this post