Skip to Content

సంతోషాన్ని వ్యక్తపరచే పాటలు

  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

సంతోషాన్ని వ్యక్తపరచే పాటలు

మీకు ఇష్టమైన పాట ఏది అని ఎవరైనా మమ్మల్ని అడిగితే, కొంచం కూడా ఆలోచించకుండా వెంటనే పాడేస్తాము. పాటలు మన ఆనందాన్ని వ్యక్తీకరించడానికి మరియు ఆ పాట చరణాల్లోని పదాలను గుర్తుంచుకోవడానికి మనలో అది ఒక అందమైన అనుభూతి.

కీర్తనలలోని కొన్ని అధ్యాయాలు అందమైన పాటలకు మంచి రాగాన్ని సిద్ధపరచిన ఎన్నో పాటలను ఎన్నడు మనం మరచిపోలేము. పాటలు మరియు కీర్తనలతో ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా చెప్పుకోవడం మనం దేవుని వాక్యం ద్వారా గమనించగలం.

దేవుడు కూడా మన యెడల తన హర్షాన్ని సంతోషాన్ని వ్యక్తపరచే విధానం కూడా అదే; జెఫన్యా 3:17 ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.

అవును, ఒక ప్రముఖ రచయిత జాన్ మాక్ ఆర్థర్ ఈ విధంగా చెప్పారు- "ఆత్మీయతలో సమృద్ధి కలిగిన జీవితం తనకు మంచి గాత్రం ఉన్నా లేకపోయినా మంచి సంగీతాన్ని ఉత్పత్తి చేస్తుంది. సంతోషభరితమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ దేవుని పాటలతో స్తుతిస్తూనే ఉంటాడు. పరిపూర్ణమైన జీవితానికి ఇది ఒక నిదర్శనం".

సంతోషభరితమైన హృదయంతో, స్తుతులతో, పాటలతో మన దేవుణ్ణి ఘనపరచడం ద్వారా మనము ఆయనను అనుకరించిన వారమవుతాము. కీర్తనల గ్రంథము 95:1 రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము. ఆమెన్ .


Telugu Audio: https://youtu.be/eoji74TNi1o 

Share this post