Skip to Content

రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును

మనం కృంగిపోయినప్పుడు లేదా ఊహించనిది జరిగినప్పుడు, ప్రస్తుత పరిస్థితినుండి ఎలా దాటిపోవాలో కష్టంగా అనిపిస్తుంది. జరగబోయే కార్యాలు ఏ విధంగా ఉంటాయో సంశయంగా ఉంటాయి. 

కానీ దేవుడే స్వయంగా మన సమస్యల్లో ప్రమేయం చేసుకొని, ఆశీర్వాదకరమైన నిరీక్షణ గురించి మనకు హామీ ఇచ్చినప్పుడు, ఆయన చెప్పిన మాట ద్వారా మనకు మంచి జరుగుతుందని ప్రోత్సహించబడతాము మరియు బలాన్ని పొందుతాము.

ఇశ్రాయేలీయులు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడు వారి భవిష్యత్తు కోసం నిరీక్షణను ప్రకటించాడు…

యిర్మియా 31:17 రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక యున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు; ఇదే యెహోవా వాక్కు.

మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా లేదా ఈ రోజు మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందడం అసంభవం అనుకున్నా, దేవుడు ఈ రోజు తన వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాడు మరియు విశ్వాసకర్తయైన దేవుడు నిరీక్షణతో కూడిన భవిష్యత్తు గురించి హామీ కూడా ఇస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులతో ఉన్నట్లే, మీ పక్షాన ఉన్నందున సంతోషకరంగా జీవించండి.

మీ భవిష్యత్తును మీకే కాకుండా రాబోయే తరానికి కూడా ఆశీర్వాదకరంగా ప్రకటిస్తున్నాడు...ఆమెన్

Telugu Audio: https://youtu.be/LfnXet6vYk4 

Share this post