Skip to Content

ప్రత్యర్థిని ఓడిస్తే విజయోత్సవాలే.

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

ప్రత్యర్థిని ఓడిస్తే విజయోత్సవాలే.

ప్రత్యర్థి లేక ప్రత్యర్థులతో తలపడినప్పుడు ఉత్తమమైన ప్రదర్శన, నైపుణ్యము, ఆవిష్కరణ, బలము చూపగలిగినవారిని విజేతలని అంటుంటాము. 

మన ప్రత్యర్థి తను విజేతగా నిలవడానికి, మనలను ఓడించడానికి, ఏదేను వనంలో ప్రవేశించి,  మోసపూరితమైన మాటలతో హహవ్వను నమ్మించి అప్పటివరకు వున్న మహిమను కోల్పోయేటట్టు చేసాడు. తద్వారా దేవుని సాన్నిహిత్యాన్ని పోగొట్టి, శాపానికి గురిచేసి మరణాన్ని కలుగచేయుటద్వారా విజేతనయ్యానని విర్రవీగుతున్నాడు. 

ఏదేనువనంలో ప్రారంభమైన పోరాటము కల్వరి కొండవరకు సాగింది. అయితే మరణమును గెలిచి పునఃరుత్థానము ద్వారా యేసు విజేతగా నిలిచాడు. 

అంతేకాక “సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.” (రోమా 16:20) తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికి దేవుని పిల్లలగుటకు అధికారము నిస్తానని వాగ్దానమిచ్చాడు. ఆ అధికారాన్ని యేసు ఓడించిన శత్రువును మన కాళ్ళక్రిందుంచడానికి వినియోగించాలంటాడు.

మన కాళ్ళక్రిందనున్న ప్రత్యర్థి ఎదోలా మోసగించి, ఏమార్చి తిరిగి మన జీవితాలపై విజయం సాధించాలని ప్రయతత్నిస్తునే ఉంటాడు. అందుకోసం తన శక్తియుక్తులన్నిటిని ఉపయోగిస్తాడు.

అనుక్షణం మనలను ఓడించడానికి  ప్రయత్నిస్తూ ఉండే అపవాదిని మన కాళ్ళక్రింద ఉంచడానికి  దేవుని శక్తియుక్తులన్నిటిని ఉపయోగిద్దాం! ఆమెన్.

Telugu Audio: https://youtu.be/PeV4Ei4wo6w 

Share this post