Skip to Content

పరిచర్య పిలుపు

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

పరిచర్య పిలుపు 

లూకా 5:10 అందుకు యేసు భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.

తాను చేయబోతున్న నూతన పరిచర్యలో అననుకూల పరిస్థితులకు, సవాళ్లకు భయపడాల్సిన అవసరం లేదని యేసు క్రీస్తు సీమోను పెతురుకు హామీ ఇచ్చాడు. అవును, అతను ఇకపై చేపలను పట్టవలసిన అవసరము లేదు, బదులుగా, అతను మనుషులను పట్టే జాలరిగా దేవుడు సిద్ధం చేస్తున్నాడు. సీమోను పేతురు గొప్ప సువార్తికుడు అయ్యాడు, ధైర్యంగా సువార్త బోధించాడు మరియు చాలా మందిని రక్షణ వైపు నడిపించాడు.

క్రీస్తు అనుచరులుగా, యేసు క్రీస్తును గూర్చిన సువార్తను ఇతరులతో పంచుకోవడానికి మనకు కూడా ఒక పరిచర్య ఇవ్వబడింది. పేతురు లాగ, మనం కొన్నిసార్లు మన ముందు ఉన్న పనికి సరిపోలేమని నిరుత్సాహపడవచ్చు. అయినప్పటికీ, యేసు పేతురు తో చెప్పిన మాటలు మనం భయపడాల్సిన అవసరం లేదని గుర్తుచేస్తుంది ఎందుకంటే దేవుడు మనల్ని పనికి సన్నద్ధం చేస్తాడు, మనలను తన పని చేయమని పిలిచాడు. మనల్ని పిలిచినవానిపై నమ్మకం ఉంచాలి మరియు విశ్వాసంలో అడుగు వేయడానికి సిద్ధంగా ఉండాలి.

ఈ రోజు, మన జీవితాలలో దేవుని పిలుపు యొక్క శక్తిని మరియు ఆయనను అనుసరించడానికి గల ప్రాముఖ్యతను గుర్తు చేసుకుందాం. దేవుడు మనలను పిలిచిన పిలుపుకు అడుగులు ముందుకు వేద్దాం. విశ్వాసంతో వేసే ప్రతి అడుగులో దేవుడు మనకు మార్గనిర్దేశం చేస్తాడు. అనేకులకు సువార్తను సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు మిమ్మును సిద్దపరచును గాక. ఆమెన్.

అనుదిన వాహినిTelugu Audio: https://youtu.be/7J5kDb4QY80 


Share this post