- Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar
- Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
- Reference: Sajeeva Vahini
నీ సామర్ధ్యమే నీ విజయం!
మన జీవితంలో దేవుడు గోప్పకార్యాలు చేస్తున్నాడు అనడానికి ఈ రోజు మనం సజీవుల లెక్కలో ఉండడం. నిన్నటి దినమున గతించిపోయిన వారికంటే మనం శ్రేష్టులం కాకపోయినప్పటికీ, దేవుని కృప మరియు ప్రేమ మనల్ని విడిచిపోలేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయమున లేచామంటే రాత్రి పడుకునే వరకు మన జీవితంలో కాస్త సంతోషం కొంచెం బాధ ఈ రండు కలిసి ఉండి, వీటిలో ఏ ఒక్కటి ఎక్కువైనా ఆరోజు మనం ఎలా గడిపాము అన్న ప్రశ్నకు సమాధానం మీకే వదిలేస్తున్నాను.
నేను నేర్చుకున్న నా అనుభవంలో సంతోషం బాధ ఈ రెండూ తాత్కాలికమే, కీర్తన 73:25 లో “ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు”. అంతకంటే మనకింకా ఏం కావాలి? మన రక్షణ, మన కాపుదల, మన బద్రత, మన సంతోషం, అన్ని మన పరలోకపు తండ్రితోనే కదా. ఆయనతో ఉంటె ఇవన్నీ మనం పొందుకున్నట్టే కదా.
నా అనుభవంలో నేను నేర్చుకున్న క్రైస్తవ విశ్వాసంలో గెలుపు ఓటముల మధ్య జరిగే సంఘర్షణలో ప్రతి క్రైస్తవుడు అనుదినం పోరాడుతూనే ఉంటాడు. గెలుపు కంటే అత్యధికంగా ఓటమి పాలయ్యే సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనం విజయం పొందిన సందర్భాలను పరీక్షించి చూసినప్పుడు వాటి వెనక ఎన్నో కష్టనష్టాలు ఉంటాయి ... ఈ మాట వాస్తవమే కదా. శ్రమ, కష్టం, ఓర్పు, పట్టుదల ఇవన్నీ లేకుండా విజయం పొందడం అసాధ్యం.
మన జీవితంలో శక్తి మరియు తలాంతులతో పాటు మనకుండే పరిథిలో మనం విజయాలు పొందగలిగితే ఉత్తమమైనది - అని నేనంటాను; ఎందుకంటే మన ప్రతి బలం మరియు మనలోని ప్రతి బలహీనత ఆయనకు పూర్తిగా తెలుసు కాబట్టి. యేసు క్రీస్తు కూడా మన నుండి ఆశించేది ఇదే. మనం పుట్టిన దగరనుండి చివరి శ్వాస వరకు మనలోని సామర్ధ్యాలు మెరుగుపడుతూనే ఉంటాయి. ఈ రోజు నేను పొందిన విజయానుభవం రేపు ఉండకపోవచ్చు కదా. నేడు ఉన్న బాధ రేపు సంతోషంగా మారవచ్చును కదా. అయితే, వీటన్నిటి ద్వారా మనం పొందే అనుభవం మనలోని ఉత్సాహాన్ని కలుగజేయవు గాని; ఒకనాడు నిత్యత్వంలో క్రీస్తుతో నేను ఉంటాను అనే నిరీక్షణే మనలను ముందుకు నడిపిస్తుంది.
https://www.youtube.com/watch?v=qhLz0BQ7eAY