- Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
- Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
- Reference: Sajeeva Vahini
మన అడుగుజాడలు
ఫిలిప్పీయులకు 4:9 మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
యేసు క్రీస్తును అనుసరిచే మన విశ్వాసానికి గూర్చిన జ్ఞానములో నిమగ్నమవ్వడం చాలా అరుదుగా ఉంటుంది, దానిని నిజంగా జీవించడంలో విఫలమవుతుంది. మనం తరచుగా చర్చికి హాజరవుతున్నప్పటికీ, ప్రసంగాలు వింటూ, బైబిలును అధ్యయనం చేస్తున్నప్పటికీ, మనం నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టకపోతే, వాటి యొక్క ప్రయోజనాన్ని కోల్పోతాము.
అపో. పౌలు, సువార్తను ప్రకటించడమే కాకుండా తన జీవితంలో కూడా దానిని ప్రదర్శించిన వ్యక్తికి గొప్ప ఉదాహరణ. వారు నేర్చుకున్న పాఠాల నుండి వారి ఆధ్యాత్మిక ప్రయాణాలలో తన అడుగుజాడలను అనుసరించాలని ఫ్జిలిప్పీ సంఘాన్ని ప్రోత్సహించాడు. ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపడం అంటే, ఒక వ్యక్తి తాను ఏదైతే మాట్లాడుతూ ఉన్నడో ఆ మాటపై కట్టుబడి జీవించాలి. ఉదాహరణకు ఇతరుల పట్ల ప్రేమ మరియు దయ చూపడం ద్వారా, మనకు అన్యాయం చేసిన వారిని క్షమించడం ద్వారా, నీతి నిజాయితీతో కూడిన జీవితాన్ని గడపడం ద్వారా ఋజువు చేయాలి. మనం క్రీస్తు బోధలను వింటూ, ఆచరిస్తున్నప్పుడు, దేవుని మార్గాలను అనుసరించడం వల్ల కలిగే శాంతిని మనం అనుభవిస్తాము. దేవుడు మనతో ఉన్నాడని మరియు అడుగడుగునా మార్గాన్ని నిర్దేశిస్తాడని మనకు తెలుసు కాబట్టి మనం భవిష్యత్తు గురించి చింతించము. కాబట్టి మనం క్రీస్తు నుండి నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టడానికి, ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపడానికి మరియు ఆయనను అనుసరించడం ద్వారా వచ్చే ఆనందం మరియు శాంతిని అనుభవించడానికి మనస్ఫూర్తిగా కృషి చేద్దాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమెన్.
అనుదిన వాహినిTelugu Audio: https://youtu.be/0oqancvvtYg