Skip to Content

మా బ్రదుకు దినములు!

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

మా బ్రదుకు దినములు!

ప్రాణాంతకమైన వ్యాధి సోకిందని ఒక తండ్రి తన కుమారుణ్ణి హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాడు. పరీక్షలు చేసిన డాక్టర్ గారు, కొన్ని దినములు ట్రీట్మెంట్ చేస్తాము బ్రదు   కుతాడని ఖచ్చితంగా చెప్పలేము, కాని వేచి చూడండి అన్నాడు. రోజులు, వారాలు గడుస్తున్నాయి, వారం వారం పరీక్షల రిపోర్టు ఏమి వస్తుందా అని ఎదురు చూస్తున్న తండ్రి – ఒకవైపు, వైద్యుని దగ్గర నుండి ఖచ్చితమైన సమాధానం కొరకు ఎదురుచూస్తూ – మరోవైపు, జీవమరణాల మధ్య ప్రాణంతో కొట్టుకుంటూ నిలకడలేని కుమారుని ఆరోగ్య పరిస్థితి -  నిరాశ, బాధతో అనుదినం పోరాడుతూ ఎదురుచూపులో సహనాన్ని కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది.  ఇటువంటి పరిస్థితులు భరించాలంటే చాలా కష్టం కదా.

మరణం మనల్ని వేరు చేయడానికి ముందు – వారాలు, నెలలు, సంవత్సరాలు లేక దశాబ్దాలు మనకు ఉంటాయా? వ్యాధులు, ఆరోగ్య పరిక్షలు వంటివి ఉన్నా లేకపోయినా మనం ఒకనాడు మరణించాల్సిందే. కరోనా, క్యాన్సర్ వంటి వ్యాధులు చావును మన మనస్సులో దాచియుంచడానికి బదులు దానిని కొంచెం ముందుకు తీసికొని వస్తాయి, అయినా మరణాన్ని తప్పించుకోగాలమా? లేదు కదా. 

మరణం గూర్చిన దుఃఖ కరమైన జ్ఞాపకాలను ఎదుర్కొన్నప్పుడు మోషే చేసిన ప్రార్ధన – మన జీవితాలు గడ్డివలె ఎండిపోయినా, దేవుని వద్ద మనకు శాశ్వత నివాస స్థలం ఉందని 90వ కీర్తనలో వివరించాడు. జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేలా మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము (కీర్తన 90:12) అని మోషే వలే మనం దేవుణ్ణి అడగవచ్చు. నేనంటాను, నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యాన్ని కోల్పోవడం. దేవుడు లెక్కించేదిగా ఉండేలా మన చేతి పనిని చెయ్యడం ద్వారా మన కొద్ది జీవితాలను ఫలవంతంగా చేయవచ్చు. ఎంతకాలం బ్రదుకుతామో తెలియకపోయినా - క్షణమాత్రముండు మన జీవితాలు శాశ్వతంగా నిలిచే దేవునిపై విశ్వాసముంచగలిగితే, మనం బ్రదికే దినములన్ని సంతోషభరితంగా ఉంటాయి. ఆమెన్.


Telugu Audio: https://youtu.be/fZ83XmeE9oM 


Share this post