Skip to Content

క్రీస్తు సాక్షి

  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

క్రీస్తు సాక్షి

రోమా సామ్రాజ్యం వారి అహంకారయుక్తమైన అధికారంతో ఆ దుశ్పాలకులు యేసును దోషిగా నిర్ధారించి, నేరస్తునిగా అత్యంత బాధాకరమైన శిక్షతోపాటు, సుదీర్ఘమైన మరణ శాసనాన్ని అమలు చేశారు.  బైబిలులో పేరు కూడా ప్రస్తావించని ఓ శాతాధిపతి, యేసు క్రీస్తు సిలువకు ప్రత్యక్ష్య సాక్షి.

భూకంపం మరియు సుదీర్ఘమైన ఆ సూర్యగ్రహణంలో, సర్వలోక పాప పరిహారంగా యేసు క్రీస్తు త్యాగాన్ని కళ్ళారా వీక్షించి తన పాపానికి కూడా ఆ క్రీస్తే విమోచన అని  తెలుసుకున్నాడు ఈ శాతాధిపతి. ఈరోజు మన పాపలకు కలిగిన విమోచన ఆనాడు ఆ శాతాధిపతి క్రీస్తును స్వయంగా కలుసుకున్నప్పుడు కూడా అట్టి విమోచన పొందగలిగాడు. చీకటి నుండి వెలుగు దిశగా తన ప్రస్థానం మొదలైంది. యేసు సిలువలో పలికిన యేడుమాటలు విన్నాడు. క్షమాపణకు నిజమైన అర్ధం ఏంటో గ్రహించగలిగాడు. 

మత్తయి 27:54 శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.

అవును, యేసుప్రభువు మరణం పునరుత్థానం వైపు చూస్తూ, "నిజంగా ఈయనే దేవుని కుమారుడు - ఈయనే లోక రక్షకుడు" అని ప్రకటించగలిగిన వారందరికీ - జీవితం ఆశీర్వాదకరం అవుతుంది. ఆమెన్.


Telugu Audio: https://youtu.be/bQphDjr46YA 


Share this post