Skip to Content

క్రైస్తవుని జీవన శైలిలో - శక్తివంతమైన జీవితం

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

క్రైస్తవుని జీవన శైలిలో - శక్తివంతమైన జీవితం

నీవు దేనినైన యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు 22:28

శక్తి అనే పదానికి గ్రీకు భాషలో ఒకే అర్ధమిచ్చు 5 వేరు వేరు పదాలున్నాయి . ఒకరోజు సమాజమందిరములో యేసు క్రీస్తు అందరి ముందు నిలబడి ఊచచెయ్యి గలవానితో నీ చెయ్యి చాపుమనగానే; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను (మార్కు 3:5). యేసు క్రీస్తు చేసిన అద్భుతాల్లో బహుషా ఇది అతి చిన్న అద్భుతమై యుండవచ్ఛు, కాని ఇందులో గొప్ప శక్తి దాగి ఉన్నది.

ఈ 5 రకములైన శక్తి మన చేతికి ఉండే ఐదు వేళ్ళకు సాదృశ్యంగా ఉంది. రోజూ మనం చూసే మాములుగా కనబడే మన చేయి దేవుని ఆజ్ఞతో ముందుకు చాపగలిగితే దేవుని శక్తిని విడుదల చేసే బలమైన సాధనమై ఉంటుంది. ఆ శక్తిని విడుదల చేయగలిగే సాధనం ప్రార్ధన తోనే సాధ్యం.

దేవుడు తన శక్తివంతమైన సామర్థ్యాలను, అధికారాలను మనలో నింపాలని అనుదినం ప్రయత్నం చేస్తుంటాడు. ఈ శక్తి మన స్వలాభము కోసమో లేదా స్వాప్రయోజనం కోసమో కాదు గాని దేవుడు తన మహిమను మన ద్వారా జరిగించుకోడానికి, అనగా తన పని కోరకు నియమింపబడిన మన ద్వారా బయలుపరచుకొడానికేనని గ్రహించాలి.

ఈ అనుభవం దైనందిన మన జీవన శైలిలో దెవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చగలిగే శక్తివంతమైన జీవితాలుగా మార్చబడతాయి. ఎపుడైతే మన కన్నులు దేవునివైపు చూస్తాయో; వారిని దేవుడు తన ఆత్మతో ముద్రించి, మనం యోచన చేసే ప్రతి ఆలోచనలను దేవుడు స్థిరపరచి; చేసే ప్రతి పనిలో, ఎంపిక చేసుకునే ప్రతి నిర్ణయంలో, నడిచే ప్రతి మార్గంలో దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమేన్.

Telugu Audio: https://youtu.be/xWU_5q_LROc?feature=shared

Empowered Living: Walking in the Light of God-s Power

"As you decide, so it will be, and light will shine on your ways." - Job 22:28

In the synagogue, Jesus stood beside a man with a withered hand and healed him, simply by instructing him to stretch it out (Mark 3:5). Though seemingly modest, this miracle encapsulates immense power.The Greek word for "power" holds five distinct meanings, akin to the fingers on our hand. When aligned with God-s command, our actions become potent tools for releasing His divine power into the world, facilitated through prayer.

God seeks to imbue us with His powerful abilities, not for our own gratification, but to showcase His glory through us. This divine empowerment transforms our lives, enabling us to fulfill God-s purposes in our daily walk.

As we fix our eyes on God, His Spirit envelops us, anchoring every thought and illuminating our path with His radiant light. Thus, in all our endeavors, decisions, and journeys, we are guided by the radiant presence of God. Amen.

English Audio: https://youtu.be/Z4q7ES1JwmM

Share this post