Skip to Content

క్రైస్తవుని జీవన శైలిలో - శక్తి సామర్ధ్యాలు

  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

క్రైస్తవుని జీవన శైలిలో - శక్తి సామర్ధ్యాలు

మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు 1 యోహాను 4:4

నేనేది సాధించలేకపోతున్నాను, ఏ పని చేసినా అందులో ఫలితం లేకుండా పోతుందనే ఆలోచన మనలను ఎప్పుడూ క్రిందకు పడేస్తుంది. ఎంతో కష్టపడి, శ్రమపడి చేసే పనుల్లో విజయం చూడలేని సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సార్లు ప్రార్ధనతో ప్రారంభించినా ఫలితం దొరకకపోగా నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటారు?

ప్రార్ధన చేసినప్పుడున్న శక్తి, సమస్యను ఎదుర్కొంటున్నపుడు మనలోని అవిశ్వాసం వలన బలహీనులమవుతాము. నేను చేయగలనా లేదా, నేను చేయలేనేమో, నేను చేసేది సరైనదో కాదో వంటి ప్రశ్నలు మన మనసులో మొదలైయ్యే అనేక సందేహాలు. విశ్వాసంలో మనం బలహీనంగా ఉన్నప్పుడే మనకు అపజయాలు ఎదురవుతాయి. అయితే, దేవుడిచ్చే శక్తి సామర్ధ్యాలు మనలను బలపరుస్తూ మనలోని విశ్వాసాన్ని మెరుగుపరుస్తుందని గ్రహించాలి.

శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము మన శక్తి సామర్ధ్యాలను హరించి వేస్తే, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని విశ్వసిస్తే దేనినైనా సాధించగల శక్తి సామర్ధ్యాలు మనలను మరింత బలవంతులను చేస్తుంది. అంతేకాదు, దేవుడిచ్చే శక్తికి భక్తి విశ్వాసాలు తోడైతే, జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది.

శక్తి కలిగిన విశ్వాసమే నిలకడ నిశ్చయత కలిగే అనుదిన జీవితానికి పునాదిగా ఉంటుంది. ప్రాణంతో ఉన్న చేప మాత్రమే నీటిలో ఎదురు ఈద గలుగుతుంది, ప్రాణంలేనిది ఆ నీటి తాకిడికి కొట్టుకుపోతుంది కదా. మన హృదయంలో నివసించగల క్రీస్తు మనలో ఉన్నాడనే సజీవమైన విశ్వాసం మనలోని సామర్ధ్యాన్ని రెట్టింపుచేస్తూ, సమస్యల తాకిడికి ఎదురెల్లి వాటిని ఛేదించగలననే సంకల్పాన్ని మనలో బలపరచి, ఏ సమస్యనైనా సుళువుగా ఎదుర్కోగలననే ఖచ్చితమైన నిశ్చయతను కలుగజేస్తుంది. ఈ అనుభవం శక్తివంతమైన క్రైస్తవుని జీవన శైలిలో ప్రత్యేకమైనది. ఆమేన్

Telugu Audio: https://youtu.be/xWU_5q_LROc?si=lXLefltMk--yHv-L

Unleashing Divine Power: Faith Beyond Limitations

"In you, the power of God surpasses all worldly obstacles." - Inspired by 1 John 4:4

Often, feelings of inadequacy and repeated failures weigh heavily upon us, casting doubt on our abilities. Despite our prayers, when results elude us, despair creeps in. But why does this happen?

In moments of trial, our resolve wavers, and doubts cloud our faith. We question our capability and fear failure. Yet, it-s in these moments that we must recognize the strength bestowed upon us by God, which fortifies our faith and empowers us to persevere.

When the burdens of the world drain our energy and diminish our resolve, it-s our unwavering faith in the indwelling presence of God that revitalizes our spirit. Coupled with our religious convictions, this divine empowerment elevates our existence beyond mere expectations.

Faith, intertwined with divine power, forms the bedrock of a resilient life. Just as only living fish thrive in water while lifeless ones are swept away, a vibrant faith in Christ revitalizes our abilities, emboldens us to confront challenges head-on, and assures us of our capacity to overcome. Such is the hallmark of a life lived in the powerful embrace of Christianity. Amen.

English Audio: https://youtu.be/Z4q7ES1JwmM?si=OzAJcN6HK55D5ZSO

Share this post