Skip to Content

క్రైస్తవుని జీవన శైలిలో - ఆలోచనల శక్తి | HARNESSING THE POWER OF THOUGHTS THROUGH FAITH

  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

క్రైస్తవుని జీవన శైలిలో - ఆలోచనల శక్తి

అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు సామె 23:7

మన జీవనశైలిని ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో అప్పుడే మన ఆలోచనలు కూడా మార్పుచెందుతాయి. అంతేకాదు, మన ఆలోచనల్లో మార్పును బట్టే మన జీవన శైలి కూడా రూపాంతరం చెందుతుంది. బాహ్యంగా కనిపించే మన క్రియలు మన హృదయాల్లోనుండి పుట్టినవే, వాటన్నిటికి కారణం మనసులో ఏ మూలనో మొదలైన ఆలోచన. ప్రతి ఆలోచన శక్తిగలది!

రక్షించబడిన దినమున ప్రతి ఒక్కరం ఉన్నతమైన తీర్మానాలు తీసుకుంటాం ఇది సహజమే. కానీ అనుదిన జీవిత ప్రయాణంలో ఒడుదుడుకుల మధ్య బలహీనమవుతూనే ఉంటాము... ఎందుకు? మంచి చెడుల మధ్య మన ఆలోచనల సంఘర్షణ, వాస్తవాల మధ్య పోరాడుతూనే ఉంటుంది కాబట్టి.

నేనంటాను, ఒక మనిషి జీవితం అతని ఆలోచనలను బట్టే జీవిస్తుంటాడు. మనమెటువంటి వారమనేది "మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైతే ఆలోచిస్తామో" అదే మనం. దినమంతా మనం ఆలోచనచేసే సంగతులు, ఎంత పనిలో ఉన్నా...మన మనసులోని తలంపుల్లో ఎదో ఒక మూలాన ఆ రోజుకు సంబంధించిన ఆలోచన మనలను వెంటాడుతూనే ఉంటుంది. అది మంచైనా చెడైనా అదే మనం.

మన కళ్ళముందు జరిగే సంఘటలను బట్టి, రోజు మనతో ఉండే వారిని బట్టి మన ఆలోచనలలో మార్పులు కలుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా మన ఆలోచనలను మనం భద్రం చేసుకొని ఏ విధంగా జీవించాలో మనం నిర్ణయించుకోవాలి.

మంచి చెడుల మధ్య వ్వత్యాసం మనం బ్రదికినంత కాలం మన తలంపులు మనలను ప్రభుత్వం చేస్తూనే ఉంటాయి. మన అంతరేంద్రియము లన్నింటిని నియంత్రించేది మన ఆలోచనలే కదా. అందుకే, మన ఆలోచనలకు మనమే ఉత్తరవాదులము. వేరెవ్వరు నియత్రించలేని మన ఆలోచల పై ఎప్పుడైతే మనం నాయకత్వం చేయగలుగుతామో అప్పుడే జీవితం ఆశీర్వాదకరమవుతుంది. మన తలంపుల్లో లోపలకు చొచ్చుకునే ఆలోచనలు, అదే తలంపులనుండి బయటకు వచ్చే ఆలోచనలను మనం మాత్రమే నియత్రించగలం.

యేసు క్రీస్తు కోరుకునే మంచి ఆలోచనలు మనం పరిశుద్ధాత్మ ద్వారానే పొందుకోగలము. సర్వ సత్యములోనికి నడిపించే ఈ శక్తి సామర్ధ్యలు మన జీవన శైలిని సరైన మార్గంలో నడిపిస్తాయి. ప్రయత్నించి చూడండి. ఆమెన్

Telugu Audio: https://youtu.be/FaAxi3Xi_bw

HARNESSING THE POWER OF THOUGHTS THROUGH FAITH

"For as he thinketh in his heart, so is he." - Proverbs 23:7

In the journey of faith, our thoughts wield immense power. They shape not only our actions but also the very essence of who we are. As believers, we are called to understand the profound influence our thoughts hold over our lives.

When we embrace salvation, we are filled with the Holy Spirit, empowering us to embark on a path of righteousness. Yet, as we navigate the complexities of life, our resolve may falter, and the whispers of the Spirit can be drowned out by the clamor of the world.

Our minds, fertile ground for both virtue and vice, constantly churn with ideas that shape our reality. In moments of solitude, our true selves are revealed through the thoughts we entertain. Whether we dwell on light or darkness, our thoughts mold us accordingly.

The sights we behold and the company we keep exert a profound impact on our mental landscape. Yet, we are called to exercise discernment, steering our thoughts toward alignment with God-s will.

By the grace of the Holy Spirit, we possess the ability to discern between good and evil. It is through this divine guidance that we can harness the power of our thoughts for righteousness. Let us surrender our minds to the influence of the Spirit, allowing His wisdom to illuminate our path.

As we yield to the promptings of the Spirit, we open ourselves to receive the thoughts that align with the heart of Jesus Christ. Through Him, we are empowered to walk in the fullness of truth, guided by the light of His love. God Bless You. Amen.

English Audio: https://youtu.be/NzDCeBO_i84

Share this post