Skip to Content

ఎన్నడూ మారనిది ఏంటి?

  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

ఎన్నడూ మారనిది ఏంటి?

నేను పదవ తరగతి చదువుకుంటున్న రోజుల్లు ఉన్న సిలబస్ ఈ కాలంలో ఆ తరగతి చదువుకునే విద్యార్ధులను ఆడిగినప్పుడు పుస్తకాల్లో, పఠాలలో ఎన్నో మార్పులు చేసారని అర్ధమయింది. బహుశా మీరుకూడా గమనించియుండవచ్చు. మార్పుల గూర్చి పరస్తావిస్తే మనం పుట్టినప్పుడు ఉన్న పరిస్తితులు నేడు మనం చూస్తున్న అభివృద్దిలో ఎన్నో మార్పులు. ఇదిలా ఉంటె నేడు కరోనా వల్ల జీవన విధానాల్లో ఎన్నో మార్పులను మనం చూస్తునే ఉన్నాం  కదా. ఏదీ శాశ్వతంగా ఉండదు అనే విషయం మనలో అందరము అనే మాటే.

ఉద్యోగంలో మార్పు, క్రొత్తగా ఏర్పడిన స్నేహ సంబంధం, అస్వస్థత, మరణం లాంటి ఎన్నో సంగతులు కేవలం రెండు సంవత్సర కాల వ్యవధిలో మనకు తెలియకుండానే జరిపోవచ్చును. మంచో, చెడో మన జీవితంలో మనల్ని దర్శించడానికి ఎదో ఓ మూల దాక్కొని ఉండవచ్చు. ఇటువంటి సందర్భాల్లో “ఎన్నడు మారని మార్పు చెందని వాడు మనతో ఉన్నాడని గ్రహించినప్పుడు ఎంతో ఆదరణను కలిగిస్తుంది. “. నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు” కీర్తన 102:27. ఈ సత్యం యొక్క సారం అపారమైనది. అంటే దేవుడు ఎప్పటికీ -ప్రేమ, న్యాయం, జ్ఞానం కలిగినవాడని అర్ధం. ఈ విశ్వం ఉనికిలోనికి రాకమునుపు దేవుడు ఏ గుణలక్షణాలు కలిగియున్నాడో, ఖచ్చితంగా నేడు కుడా అవే కలిగియున్నాడు. ఇంకా ఎప్పటికి అవే కలిగియుంటాడు అనుటలో ఎట్టి సందేహమూ లేదు. 

“శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.” యాకోబు 1:27 లో అంటున్నాడు. మారుతున్న మన పరిస్తితుల్లో ఏకరీతిగా ఉన్న దేవుడు మనతో ఉంటాడని గ్రహించినప్పుడు ధైర్యంగా ఉండవచ్చు. శ్రేష్ఠమైన ప్రతి దానికి మూలం తానైనప్పుడు, ఆయన చేసే ప్రతీదీ మంచిదే కదా. ఏది ఎప్పటికి నిలిచియుండక మారిపోవచ్చు అని మనం అనుకున్నప్పుడల్లా, మనతో దేవుడు తన మంచితనాన్ని చూపించడంలో ఏకరీతిగా ఉన్నాడనే ఆలోచన మన జీవితాలకు ఆశీర్వాదకరం. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/7ymfHrowZ6g 


Share this post