Skip to Content

దేవుని వైపు చూడగలిగితే

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

దేవుని వైపు చూడగలిగితే

కీర్తనల గ్రంథము 27:6 ఇప్పుడు నన్ను చుట్టుకొనియున్న నా శత్రువుల కంటె ఎత్తుగా నా తలయెత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవానుగూర్చి స్తుతిగానము చేసెదను.

మనకు శక్తి లేదా సహాయం అవసరమైనప్పుడు మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు మనకు లభించే హామీ గూర్చి ఈ వాక్యం వివరుస్తుంది.

వ్యతిరేక పరిస్థితులు మీ యెడల ఎంత శక్తివంతంగా పని చేస్తున్నా వాటన్నిటిపై విజయాన్ని దయజేయగల సమర్ధుడు మన దేవుడు

అనేక సార్లు మన శత్రువు మన పాత స్వభావం, మన ప్రాచీన మనస్తత్వం మరియు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలబడే అడ్డుగోడలు తప్ప మరెవరో కాదు.దేవుడు మన యెడల తన గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు అని అనిపించినప్పుడల్లా మన నోట స్తుతి గానాలు తప్ప మరొకటి ఉండదు.

ఈరోజు మనలోని తగ్గింపు కలిగిన స్వభావముతో ఆయనను చేరుకున్నప్పుడు  ప్రతి ప్రతికూల పరిస్థితిలో లేదా కష్టకాలంలో మనందరికీ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు.ఆయన ఆధిక్యతకు మనల్ని మనం సమర్పించుకుందాం ఎల్లప్పుడూ దేవుని కీర్తికి కారణంగా జీవిద్దాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమేన్

అనుదిన వాహినిTelugu Audio: https://youtu.be/1_VQnq7Gxmk 

Share this post