Skip to Content

దేవుని తీర్పుఖచ్చితమైనదేనా?

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

న్యాయం యొక్క సారాంశం

యెషయా 26:9 రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించు చున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు.

ఒక విషాదకరమైన ప్రమాదం, స్నేహితుడి నుండి మోసం లేదా దీర్ఘకాలిక అనారోగ్యం, జీవితం మనపై విసిరే కొన్ని సవాళ్లే, వీటినుండి బయటపడడం అంత తేలికైనది కాదు. అలాంటి పరిస్థితులను తట్టుకోలేక తీవ్ర నిరాశకు లోనైనవారు కొందరుంటారు. మానవజాతి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, భూమిని నింపిన చీకటి మధ్య నిరీక్షణ యొక్క వెలుగు కిరణంగా ఉన్న తన ఏకైక కుమారుని ద్వారా దేవుడు ఒక మార్గాన్ని సృష్టించాడు. కల్వరి సిలువపై యేసు పరిపూర్ణ తీర్పు ఇచ్చాడు మరియు తండ్రియైన  దేవునికి మరియు మానవ జాతికి మధ్య సంబంధాన్ని కూడా పునరుద్ధరించాడు.

ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నదంతా దేవునికి తెలియనిదేమీ కాదు. ఆయన ఆల్ఫా ఒమేగా, ఆయనకు అంతం నుండి ఆరంభం కూడా తెలుసు. దేవుడు అన్ని పరిస్థితుల నుండి మనలను విడిపించడానికి ఖచ్చితమైన తీర్పును ఆ కల్వరి సిలువపై నెరవేర్చాడు. సిలువ ద్వారా ఆయన నీతిని మనకు బోధిస్తున్నాడు. ఇది మనలను ఆయన రాజ్యంలో భాగం చేసిన క్రీస్తుపై ఉన్న నిరీక్షణ మరియు యేసు రెండవ రాకడలో సకల రాజ్యాలను పరిపాలించడానికి ఆయనతో పాటు మనముకూడా రావాలని నిరీక్షణ కలిగియుందాము.ఆమేన్

Telugu Audio: https://www.youtube.com/watch?v=7u0GHVtfBJw

Share this post