Skip to Content

అపారమైన ప్రేమ

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

అపారమైన ప్రేమ

హోషేయ 1:7 అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం దేవుని నుండి దూరమై, వారి తిరుగుబాటును బట్టి, దేవుని ఉగ్రతను గూర్చిన సందేశాన్ని ఒక ప్రవచానాత్మక తీర్పును దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. అయితే, దక్షిణ రాజ్యమైన యుదా పై దేవుడు తన కృప కనికర వాగ్ధానమును బయలుపరిచాడు.

ఆ వాగ్ధానము, వారిని తానే ఏర్పరచుకొని రక్షిస్తాడని ముందుగానే తెలియజేశాడు. మానవ శక్తి వంటి విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేత, అనగా దేవుడే తన స్వశక్తితో వారిని రక్షిస్తాడని వాగ్దానం చేశాడు. మన దేవుడు కృప మరియు దయగల దేవుడు, ఆయన మానవ అవగాహనకు వారి సామర్థ్యానికి మించిన మార్గాల్లో తన ప్రజలను రక్షించడానికి ఎంచుకున్నాడు.

ఈ రోజు మనం ఈ వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని కృప దయ ఎంత ప్రాముఖ్యమో అది మనకు గుర్తు చేస్తుంది. మనం కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆయన కృపకు దూరమయ్యాము. కానీ ఆయన యూదా ఇంటిపై దయ చూపినట్లే, యేసుక్రీస్తుపై విశ్వాసముంచడం ద్వారా మనకు రక్షణను బహుమతిగా దయజేసాడు.

ఈరోజు ఆయన ప్రేమ మరియు ఆయన వాగ్దానాల నిశ్చయతతో మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయజేయును గాక. ఆమెన్.

అనుదిన వాహిని Telugu Audio: https://www.youtube.com/watch?v=F25AVDTiIT8&t=8s

Share this post