Skip to Content

ఆటంకాలనధిగమిస్తే విజయోత్సవమే

8 August 2024 by
Sajeeva Vahini
  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 1
  • Reference: Sajeeva Vahini

ఆటంకాలనధిగమిస్తే విజయోత్సవమే

దేవుడుఇశ్రాయేలీయులు తమ వాగ్ధాన భూమి చేరుకోవడానికి ఎర్రసముద్రాన్ని తొలగించలేదు, గాని లక్షలాదిమంది ప్రజలు రెండు పాయలుగా చీలిపోయిన ఎర్రసముద్రం దాటడానికి అతని చేతిలో ఉన్న మోషే కర్రను ఎత్తి చాపమన్నాడు. ఈ సంఘటన మన సమస్యల నుండి మనలను విడిపించడానికి దేవుడు మనవద్ద ఏది ఉంటే దానినే ఉపయోగిస్తాడని బోధిస్తుంది.

అనేకసార్లు మనం మన జీవితాల్లో సమస్యలను, సవాళ్ళను తొలగించమని ప్రార్ధించడం కంటే, ఆ సమస్యలను అధిగమించేశక్తి దయచేయుమని ప్రార్థిస్తే, విశ్వాస జీవితంలో మరింత బలం పొందవచ్చు. ప్రజల ద్వారా దేవుని అద్భుత శక్తిని బహిర్గతం చేయడానికి ఎర్ర సముద్రం దాటడం అనే పని ఒక మంచి ఉదాహరణ.

ఎర్ర సముద్రం విడిపోవాలని దేవుడు ఆఙ్ఞాపించవచ్చు, కాని ఎన్నికలేనివారిని సహితము తన అద్భుత కార్యాలకు ఆయన వాడుకుంటాడని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేయడానికి దేవుడు మోషే కర్రను ఎంచుకున్నాడు. మీ జీవితములోని -ఎర్ర సముద్రాన్ని- తొలగించనందుకు దేవునిపై కోపగించుకోవద్దు. బదులుగా యేసు నామంలో అపవాదిని ఓడించడానికి మీలోని సామర్ధ్యాలు, వరాలు, నైపుణ్యాలు, ప్రతిభ, జ్ఞానం అనే సరైన ‘కర్ర’ ను ఉపయోగించమని, మిమ్మల్ని నడిపించమని దేవుని ముఖ దర్శనాన్ని కోరండి.

ప్రార్థనకు సమాధానం ఇవ్వడానికి దేవునికి గడువు నిర్ణయించవద్దు. మీరు అనుకున్నట్లుగా కాక సమాధానం ఆలస్యం అవుతున్నప్పుడు విసుగు చెందకుండా ఉండండి. విజయపథంలో నడిపించడానికి మీ జీవితం కొరకైన దేవుని ప్రణాళిక ఎప్పుడూ మీ కంటే ఉన్నతంగా ఉంటుంది.

కాబట్టి దేవునిపై ఆధారపడండి, మిమ్మల్ని మార్గనిర్దేశం చేసేందుకు దేవుణ్ణి విశ్వసించండి. దేవుని నుండి వచ్చే సమాధానాలు కొన్ని సార్లు మనకు విభిన్నంగాను, అననుకూలంగా ఉంటాయి. కాని అవి ముందుకు దేవుని ఆలోచనలను అర్థం చేసుకోవడానికి స్పష్టంగా ఉంటాయి. ఆమేన్.

Telugu Audio: https://youtu.be/P52oJg0Vbk8 

Share this post