Skip to Content

క్రైస్తవుని జీవన శైలిలో - సన్నద్ధమైన శక్తి సాధనాలు - Christian Lifestyle - Equipped with Faith

6 August 2024 by
Sajeeva Vahini
  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Christian Lifestyle Series
  • Reference: Christian Lifestyle Series in English & Telugu

క్రైస్తవుని జీవన శైలిలో - సన్నద్ధమైన శక్తి సాధనాలు

ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. రోమా 1:17

దేవుడు మోషేను ఐగుప్తులోనుండి తన ప్రజలను విడిపించడానికి నియమించుకున్నప్పుడు, తన శక్తి సామర్ధ్యాలను బయలుపరచటానికి తన చేతిలో ఉండే కర్రను సాధనంగా వాడుకున్నాడు. దేవుని కొరకు ఎన్నుకోబడిన మోషే ద్వారా దేవుని శక్తి సామర్ధ్యాలను జీవములేని కర్ర ద్వారా బయలుపరచిన దేవుడు మన అనుదిన జీవితంలో తన మహిమకొరకు బలహీనులమైన మనలను బలమైన సాధనాలుగా వాడుకుంటాడనుటలో ఎటువంటి సందేహం లేదు.

అనుదిన జీవితంలో మనకుండే శక్తితో సామర్ధ్యాలను పెంచుకోవాలి, ఈ సామర్ధ్యం సాధనతోనే సాధ్యం. అనేక సార్లు మన దగ్గర లేని వాటి గురించే ఆలోచిస్తూ, మన దగ్గర ఉండే వాటి విలువ గుర్తించలేకుండా ఉంటాం. దేవుడు తన వాగ్ధానాలను, తన ఉద్దేశాలను, తన ప్రణాళికలను మన జీవితంలో నెరవేర్చుకోడానికి మనలోని ప్రతి బలహీనతను.. బలమైన శక్తి సాధనాలుగా మార్చగలిగే శక్తిగలవాడై యున్నాడు.

నేనంటాను, దేవుని యొక్క ఉద్దేశాలు మన ద్వారా నెరవేర్చబడాలి అంటే మన జీవితాలు సన్నద్ధమై యుండాలి, అప్పుడే ఆ శక్తి సామర్ధ్యాలు మనం పొందగలం. యుద్ధమందు పోరాడే సైనికుడు అనుదినం శిక్షణ పొందుతూ సిద్ధపడుతున్నప్పటికీ, శతువును ఎదుర్కొనే సమయంలో ఏ విధంగా సన్నధ్ధుడై ఎదుర్కొంటాడో, అదేవిధంగా దైనందిన జీవితంలో మనం పొందుతూ అనుభవిస్తున్న ప్రతి ఈవిని జ్ఞాపకము చేసుకోని, అనుదినం దేవునితో సమాధానపడుతూ, జీవితంలో విజయం పొందడగలమనే స్థిరమైన విశ్వాసంతో... ప్రార్ధనలో శిక్షణ పొందినప్పుడు..అనుకోని సందర్భాల్లో ఎదురయ్యే సమస్యలను అధిగమించగలననే నిశ్చయత కలుగజేస్తుంది.

విశ్వాసంలో సన్నద్ధమై బలపడుతున్న మనలోని శక్తి సాధనాలు దేవుని నీతిని బయలుపరిచే ఆశీర్వాదాలు. ఇది క్రైస్తవుని జీవన శైలిలో మనం ఆచరించవలసిన ప్రత్యేక సాధనాలు. ప్రయత్నిద్దామా?

Audio Available : https://youtu.be/ZJLPn5QRPYg

EQUIPPED WITH FAITH

For in the gospel the righteousness of God is revealed--a righteousness that is by faith from first to last, just as it is written: "The righteous will live by faith." . - Romans 1:17.

When God commissioned Moses to free His people from Egypt, He used the stick in His hand as a tool to reveal His power. There is no doubt that God chose Moses and revealed His power through the lifeless stick and proved that He uses the weak things as powerful tools for His glory in our daily life.

We need to increase our abilities with power in everyday life, and this is possible only with practice. Many times, we think about what we do not have, and we do not realize the value of what we have within us. God can turn every weakness in us into powerful tools to fulfill His promises, His purposes, and His plans in our lives.

I believe that our lives must be prepared to fulfill God's purposes in our lives and to acquire those strengths. Although a soldier is trained, he keeps himself ready to combat with the enemy preparing himself daily. Likewise, when we pray, by keeping track of every gift we receive from God in our everyday life with the constant conviction that we can be successful in life, being in peace with God, we can be confident that we will be able to overcome the problems encountered in any unexpected situation.

These powerful tools help to strengthen our faith, and these are the blessings of God that unleash His righteousness. These are the unique tools that we need to practice in every lifestyle of a Christian. Amen.

https://youtu.be/mwQcfNhRXeI

Share this post