- Author: Dr. G. Praveen Kumar
- Category: Christian Lifestyle Series
- Reference: Christian Lifestyle Series in English & Telugu
క్రైస్తవుని జీవన శైలిలో - ఆలోచనల శక్తి - Christian Lifestyle - Power of thoughts
అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు సామె 23:7
మన జీవనశైలిని ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో అప్పుడే మన ఆలోచనలు కూడా మార్పుచెందుతాయి. అంతేకాదు, మన ఆలోచనల్లో మార్పును బట్టే మన జీవన శైలి కూడా రూపాంతరం చెందుతుంది. బాహ్యంగా కనిపించే మన క్రియలు మన హృదయాల్లోనుండి పుట్టినవే, వాటన్నిటికి కారణం మనసులో ఏ మూలనో మొదలైన ఆలోచన. ప్రతి ఆలోచన శక్తిగలది!
రక్షించబడిన దినమున ప్రతి ఒక్కరం ఉన్నతమైన తీర్మానాలు తీసుకుంటాం ఇది సహజమే. కానీ అనుదిన జీవిత ప్రయాణంలో ఒడుదుడుకుల మధ్య బలహీనమవుతూనే ఉంటాము... ఎందుకు? మంచి చెడుల మధ్య మన ఆలోచనల సంఘర్షణ, వాస్తవాల మధ్య పోరాడుతూనే ఉంటుంది కాబట్టి.
నేనంటాను, ఒక మనిషి జీవితం అతని ఆలోచనలను బట్టే జీవిస్తుంటాడు. మనమెటువంటి వారమనేది "మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైతే ఆలోచిస్తామో" అదే మనం. దినమంతా మనం ఆలోచనచేసే సంగతులు, ఎంత పనిలో ఉన్నా...మన మనసులోని తలంపుల్లో ఎదో ఒక మూలాన ఆ రోజుకు సంబంధించిన ఆలోచన మనలను వెంటాడుతూనే ఉంటుంది. అది మంచైనా చెడైనా అదే మనం.
మన కళ్ళముందు జరిగే సంఘటలను బట్టి, రోజు మనతో ఉండే వారిని బట్టి మన ఆలోచనలలో మార్పులు కలుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా మన ఆలోచనలను మనం భద్రం చేసుకొని ఏ విధంగా జీవించాలో మనం నిర్ణయించుకోవాలి.
మంచి చెడుల మధ్య వ్వత్యాసం మనం బ్రదికినంత కాలం మన తలంపులు మనలను ప్రభుత్వం చేస్తూనే ఉంటాయి. మన అంతరేంద్రియము లన్నింటిని నియంత్రించేది మన ఆలోచనలే కదా. అందుకే, మన ఆలోచనలకు మనమే ఉత్తరవాదులము. వేరెవ్వరు నియత్రించలేని మన ఆలోచల పై ఎప్పుడైతే మనం నాయకత్వం చేయగలుగుతామో అప్పుడే జీవితం ఆశీర్వాదకరమవుతుంది. మన తలంపుల్లో లోపలకు చొచ్చుకునే ఆలోచనలు, అదే తలంపులనుండి బయటకు వచ్చే ఆలోచనలను మనం మాత్రమే నియత్రించగలం.
యేసు క్రీస్తు కోరుకునే మంచి ఆలోచనలు మనం పరిశుద్ధాత్మ ద్వారానే పొందుకోగలము. సర్వ సత్యములోనికి నడిపించే ఈ శక్తి సామర్ధ్యలు మన జీవన శైలిని సరైన మార్గంలో నడిపిస్తాయి. ప్రయత్నించి చూడండి.
Audio Version Available: https://youtu.be/z8jSwgYzdpA
Power of thoughts:
For as he thinketh in his heart, so is he. Proverbs 23:7.
Whenever we change our way of life, our thoughts also tend to change. Even, the change in our thinking can transform our way of life. Our outward actions are born out of our very own hearts. The root for all of them is a tiny idea from our mind. Our mind is powerful and Every thought from it is more powerful.
Each one of us would have planned great resolutions on the day we received salvation. That is natural because we are boosted by the power of Holy Spirit. But as time passes in our journey of life, we slowly become weak with the fluctuations occurring in our lives. And the tiny voice of Holy Spirit is left behind. Why? Because our thoughts form into ideas and conflict between good and evil and we struggle with facts.
A man's life depends on his thoughts. We are what we think when we are alone. Our minds keep thinking all day, no matter how busy we are. And then the idea of accusation creeps into our mind at some point and it will continuously haunt us. Whether it is good or bad we are the same.
What we see in our day to day life and the people we meet daily influence our thoughts. However, we must not let our thoughts control us, instead we need to decide how we should live our lives.
Our discretionary ability to differentiate between good and evil keeps governing our thoughts throughout our life. And this ability is from the Holy Spirit. It is our thoughts that control our senses. That is why we are responsible for our ideas. All the thoughts that we brood in our minds can be regulated by ourselves. If we can let Holy Spirit control our thoughts, then life becomes a blessing.
We can receive the good thoughts that our Jesus Christ likes only through the Holy Spirit. And the potential abilities that lead us into the whole truth will guide our way of life.