Skip to Content

యోసేపు

  • Author: Sirisha Raavi
  • Category: Children Stories
  • Reference: Sajeeva Vahini Dec - Jan 2010 Vol 1 - Issue 2

యాకోబు కుమారుడైన యోసేపుకు 11 మంది సోదరులు ఉండేవారు. యోసేపు అంటే ఆయన తండ్రియైన యాకోబుకు అందరికంటే ఎక్కువ ఇష్టం. యోసేపుకు వాళ్ళ నాన్న ఎన్నో బహుమతులు ఇచ్చేవారు.

అలాగే యాకోబుయోసేపుకు ఒక అందమైన రంగు రంగుల చొక్కాను ఇచ్చారు. అది చూసి యోసేపు సోదరులు తట్టుకోలేక, ఎంతో ఈర్ష్యపడ్డారు. వాళ్ళకు యోసేపు అంటే అసలు ఇష్టం లేదు. యోసేపు సోదరులు యోసేపు చిన్న వాడిగా ఉన్నప్పుడే వేరే వాళ్ళకి బానిసగా అమ్మేసారు.

యోసేపును వారు ఐగుప్తు అనే దేశమునకు తీసుకొని వెళ్లారు. యోసేపు సోదరులు తమ తండ్రి వద్దకు పోయి తమ్ముడిని ఒక క్రూర జంతువు చంపేసింది అని అబద్ధం చెప్పారు. ఐగుప్తు లో యోసేపు ఒక బానిసగా పని చేసాడు. అక్కడే ఎన్నో సంవత్సరములు యోసేపు కష్టపడి పనిచేసేవాడు, యోసేపు పెద్దవాడయ్యాడు. అతనికి ఎప్పుడు అతని తండ్రి, సోదరులను చుడాలనిపించేది. యోసేపు అంటే దేవునికీ కూడా ఎంతో ఇష్టం. దేవుడు యోసేపు నకు కలలో తనకొక గొప్ప వ్యక్తిగా చేస్తాను అని చూపిస్తారు.

తరువాత ఆ దేశము రాజు యోసేపును తన మంత్రిగా నియమిస్తారు. యోసేపు ఎంతో అందముగా ఉంటాడు. ఒక రోజు యోసేపు దగ్గరకు కొంత మంది మనుషులు వచ్చారు. వారు యోసేపుతో ఇలా అన్నారు “మేము దూర దేశమునుండు వచ్చాము, మా దేశములో కరువు ఉంది. తినడానికి తిండి లేదు.” అని ఎంతో బాధగా చెప్పారు. అప్పుడు యోసేపును వారు గుర్తుపట్టలేదు గాని యోసేపు మాత్రం వారిని గుర్తుపట్టి వారికి తినడానికి ఇచ్చాడు. దేవునికి ఎంతో వందనములు చెప్పుకున్నాడు.

తన అన్నదమ్ములు యోసేపును బానిసగా అమ్మివేసినా కూడా యోసేపు మాత్రం దేవుని ప్రేమను వారికి చూపించాడు. మనము కూడా దేవునికి ఇష్టులముగా అందరిని క్షమించాలి. వారు చేసిన తప్పులన్నీ గుర్తుపెట్టుకోకూడదు. మనము దేవుని బిడ్డలముగా వారికి చూపించాలి. అప్పుడే దేవుడు మనలను ఇంకనూ ఆశీర్వదిస్తాడు.


Share this post