Skip to Content

యిర్మీయా

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

యూదాకు మిక్కిలి అపాయకరమైన కాల స్థితిలో దేవుని ద్వారా లేపబడిన ఒక యౌవనుడు యిర్మీయా. సామర్థ్యములేని వారిని త్రోసివేయబడిన అనేకులను దేవుడు తన యొక్క ఉద్దేశము కొరకు లేక పని కొరకు ఏర్పరచుకొనుచున్నాడు. సున్నితమైన, లేక మృదువైన మనసు ధైర్యము లేని వాడైన యిర్మీయాను అసాధారణమైన వాక్కులను పలుకుటకు దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలుయూదా అని కనాను విభజించబడియున్నది.

     ఇశ్రాయేలు అష్హూరీయుల చేత నిర్మూలమైన తరువాత 136 సంవత్సరం యూదా ప్రభుత్వము నిలిచియున్నది. అలాంటి స్థితిలో ఉన్న యూదులు విగ్రహారాధనకు వారి మార్గములను చెరిపివేసికొని సరియైన మార్గము విడిచిపోవుటకు దాసులగుట చూచిన యిర్మీయా వారి కాలములో వారిని చుట్టియున్న అపాయమును గూర్చి హెచ్చరించెను. యిర్మీయా దేవునివైపు తిరుగుటకు వారిని ఆహ్వానించెను.

వరుసక్రమమునుబట్టి గాని, కాలక్రమమునుబట్టిగాని యిర్మీయా గ్రంథము అమర్చబడలేదు. గ్రంథమంతయు చదివిన యెడల గ్రంథ కర్త యొక్క జీవితమంతయు తెలియబడును. అయితే అంశక్రమమును వరుసక్రమమును మనము కనుగొనవలెను. నాశనమునకు గురైనా యూదా తప్పించుకొనుటకు ఒకే మార్గము దేవునికిలో బడుటయే వారికి బుద్ధిచెప్పుటే ఈ గ్రంథము యొక్క సారాంశము.

ఉద్దేశము : దేవుని యొక్క జనులు తమ పాపములను విడిచి పెట్టి దేవుని యొద్దకు తిరిగి వచ్చుటకు ఆహ్వానము.

గ్రంథకర్త : యిర్మీయా

ఎవరికి : దక్షిణ రాజ్యమైన యూదాకు దానియొక్క రాజధాని అయిన యెరూషలేము ప్రజలకు

కాలము : క్రీ.పూ 627 – 586

గతచరిత్ర : యెషియా, యెహోయహాసు, యెహోయాకీముయెహోయాకీనుసిద్కియా అను ఐదుగురు. యూదా చివరి రాజుల కాలములోను యిర్మీయా ప్రవచన సేవను నెరవేర్చెను. క్రీ.పూ 586లో బబులోను రాజు యూదాను నిర్మూలముచే సెను. ( 2 రాజులు 21 - 25 అధ్యాయము ) జెఫన్యా యిర్మీయాకు ముందుటివాడును, హబక్కూకుకు సమకాలీకుడగును.

ముఖ్యమైన వ్యక్తులు : పైన చెప్పబడిన ఐదుగురు యూదా రాజులు బారూకుఎబెద్మెలెకునెబుకద్నెజరును, రెగాబియురు మొదలగువారు.

గ్రంథము యొక్క ప్రత్యేకత : చరిత్ర కావ్యములు, జీవిత చరిత్ర మొదలగునవి ఇమిడియున్నవి తమ యొక్క మనస్సులోని బయలు పరుచుటకు అనేకమైన గుర్తులను ఉపయోగించుచున్నారు.

ముఖ్యపదము : తిరిగివచ్చుట, యూదాకు తన ధుర్మార్గ మార్గమును విడిచి తిరిగివచ్చుటకు ఆహ్వానము ఇచ్చుచున్నారు. యిర్మీయా అవకాశమును చివరి అవకాశమని వారికి తెలియపరచెను.

ముఖ్యమైన వచనములు : యిర్మియా 7:23-24యిర్మియా 8:11-12

ముఖ్య అధ్యాయము : 31 అధ్యాయములో యిర్మీయా తన అన్ని హెచ్చరికలకు శిక్ష తీర్పులకును మధ్య దేవుని అద్భుత వాగ్దానములను గూర్చియు యూదా ప్రజలకు జ్ఞాపకము చేయుచుండెను. దేవుడు వారితో కొత్త నిబందన చేయును. నేను నా ధర్మ శాస్త్రమును వారి మనస్సులో ఉంచి దానిని వారి హృదయములో వ్రాసెదను నేను వారికి దేవుడనైయుందును వారు నా ప్రజలై యుందురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు తన యొక్క మరణము పునరుద్దానమును వాటి ద్వారా ఈ కొత్త నిబంధనను స్థాపించి అమలులోనికి తెచ్చెను.

గ్రంథ విభజన : యూదా చరిత్రలో చీకటితో నింపబడిన కాల స్థితిలో అతిగొప్ప ప్రవక్త ఒకరు జరిగించిన సేవా ప్రతులే యిర్మీయా ప్రవచన గ్రంథము. చెరసాలలో నుండి 70 సంవత్సరముల తరువాత తిరిగి వచ్చుటను గూర్చియు క్రీస్తు ద్వారా స్థాపించబడు క్రొత్త నిబంధన ద్వారా దేవుని ప్రజలకు సొంతమగు మహిమ కలిగిన నమ్మకమును గూర్చియు యిర్మీయా పలికిన ప్రవచనములు ఎంతో గమనించతగినవి. ఈ గ్రంథములో 4 పాముఖ్యమైన భాగములు ఉన్నవి.

(1). యిర్మీయా పిలువబడుట (1 అధ్యా 1-19).

(2). యూదులకు ప్రవచనము ( 2 అధ్యా నుండి 45 అధ్యా వరకు)

(3). అన్య దేశములకు ప్రవచనము ( 46 అధ్యా నుండి 51 వరకు).

(4). ఇశ్రాయేలు (యూదా యొక్క) నిర్మూలము. బబులోను చెర అధ్యా 52.

కొన్ని క్లుప్త వివరణలు : పరిశుద్ధ గ్రంథములో 24వ పుస్తకము; అధ్యాయములు 52; వచనములు 1364; చరిత్రకు సంబంధించిన వచనములు 680; హెచ్చరికలు 1002; నెరవేరిన ప్రవచనములు 666; నెరవేరని ప్రవచనములు 180; నెరవేరిన హెచ్చరికలు 779; నెరవేరని ముందు హెచ్చరికలు 223; ప్రశ్నలు 194; ఆజ్ఞలు 303; వాగ్దానములు : 16; దేవుని యొద్ద నుండి ప్రత్యేకమైన వర్తమానములు 62.


Share this post