Skip to Content

రూతు గ్రంథం

20 July 2024 by
Sajeeva Vahini
  • Author: Praveen Kumar G
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini Oct - Nov 2010 Vol 1 - Issue 1

అధ్యాయాలు: 4, వచనాలు:85

గ్రంథ కర్త: సమూయేలు ప్రవక్త

రచించిన తేది: దాదాపు 450 నుండి 425 సం. క్రీ.పూ.

మూల వాక్యము: “నివు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నివు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;” రూతు 1:16

 ఉపోద్ఘాతం: రూతు గ్రంథం బైబిలులో చిన్న పుస్తకం. కేవలం నాలుగు అధ్యాయాలు ఉన్నప్పటికీ ఈ గ్రంథానికి చాలా ప్రాముఖ్యత ఉంది. బైబిలు గ్రంథములో స్త్రీ పేరుతొ ఉన్న గ్రంథాలలో ఒకటి ఎస్తేరు మరియొకటి రూతురూతు అన్న మాటకు అర్ధం “స్నేహితురాలు” మరియు “కనికరము”. రూతు మోయాబియురాలు అయినప్పటికీ క్రైస్తవ పరంపర లో ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంది. సాధారణంగా మన నిజ జీవితంలో ఉండే విశ్వాసము, దయ, కరుణ, కనికరము, ఓపిక, అణుకువ, నమ్రత, ప్రయాస మరియు ప్రేమ ఈ గ్రంథంలో మనం చక్కటి ఉదాహరణాలుగా గమనించవచ్చు. అంతేకాకుండా మన జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాల్లో కుడా దేవుడు మన పట్ల కలిగిన శ్రద్ధ మనలను విశ్వాసంలో ఇంకా బలపరుస్తుంది. ఈ గ్రంథం మనకు చాలా అందముగా కనబడవచ్చు అంతే కాకుండా మన నిజ జీవితంలో సహజమైన ప్రత్యామ్నాయముగా ఉంటుంది. మరియు జరిగిన సంగతులను తెలుసుకోవాలనే ఇచ్చ కలిగించే విధంగా ఉంటుంది మరియు దేవుడు తన ప్రజలకు విడుదల కలిగించిన ప్రణాళిక ఈ రూతు గ్రంథం తెలియజేస్తుంది. రూతు గ్రంథం ఒక నవల వలె ఉంటుంది అని బైబిలు పండితులు అంటారు. రూతు గ్రంథం అనేకమైన జీవిత అధ్యాత్మిక సత్యాలను మరియు చారిత్రాత్మిక సంగతులను తెలియజేస్తుంది. రూతు గ్రంథం మొత్తం ఈ గ్రంథంలో ఉన్న వ్యక్తుల పేర్లకు ఉన్న అర్ధాలను బట్టి రచించబడింది.

ఇశ్రాయేలునకు రాజు లేని దినాలలో న్యాయాధిపతులు పరిపాలించే వారు. అ దినాలలో ఆ రాజ్యామంతటా కరువు సంభవించింది. ఇశ్రాయేలు కుటుంబానికి చెందిన ఎలిమేలేకు, ఆయన భార్యయైన నయోమి, వారిద్దరి కుమారులు మహ్లోనుకిల్యోను ను వెంటబెట్టుకొని బెత్లెహేము నుండి ప్రయాణమై మోయాబు దేశమున కాపురముండుకు బయలుదేరిరి. వ్యాకులం చెందిన ఇంటి యజమాని, విధిలేని పరిస్తితిలో మోయాబు దేశమునకు తన కుటుంబముతో వచ్చి తన కుమారులైన మహ్లోనుకు రూతుకిల్యోను కు ఒర్పా అను మోయాబు స్త్రీలతో వివాహముచేసి అక్కడ కాపురముండిరి. మోయాబు దేశంలో ఎలిమేలేకు మరియు ఆయన కుమారులు చనిపోయిన తరువాత, ఆ దుఃఖకరమైన స్థితిలో వారు ఆహారము లేని వారాయెను. కరువు తీవ్రత తట్టుకోలేక మేలుకువగల అత్తగా తన ఇద్దరు కోడండ్రను జాగ్రత్తగా చూచుకొనుటకు తిరిగి తాము వదిలి వచ్చిన దేశానికి ప్రయాణమైరి. అయితే ఓర్పా అయిష్టముగా తన అత్తను మార్గము మధ్యలో వదిలి వెళ్లిపోయింది కాని రూతు తన అత్తను హత్తుకొని “ నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నివు వెళ్ళు చోటికే నేను వచ్చెదను. నివు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి బొందు చోటనే నేను మృతి బొందెదను, అక్కడనే పాతి పెట్ట బడెదను. మరణము తప్ప మరి ఎదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక” (రూతు 1:16-17) అని తీర్మానించుకొని తన అత్తతో బెత్లెహేమునకు ప్రయాణమైరి.

అప్పుడు బెత్లెహేమునందు యవల కోత కాలమున రూతు తన అత్తకు ఆధారముగా నుండుటకు పరిగె ఏరుకొందునని, అత్త వద్ద సెలవు తీసుకోని ఎలిమేలేకు వంశపువాడైన బోయజు పొలములోనికి వచ్చి చేను కోయు వారి పొలములో ఏరుకొనెను. బోయజు పేరున్న యూదయ న్యాయాధిపతి. బోయజు అను మాటకు అర్ధం “బలవంతుడు”. బోయజు రూతునకు ఉన్న యదార్థతను మరియు సత్ ప్రవర్తనను గ్రహించి ఆమెను బంధుధర్మము చొప్పున వివాహము చేసుకొనెను. యెహోవా బోయజును రూతును ఆశీర్వదించి వారికి కుమారుని అనుగ్రహించెను. అతని పేరు ఓబేదుఓబేదు అనగా “దాసుడు లేదా సేవకుడు” అని అర్ధం. ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను.

సారాంశము: రూతు గ్రంథంలోని అనేక విషయాలు మన నిజ జీవితంలో కార్యసిద్ధి కలుగజేసే విధంగా ఉంటుంది. దేవునితో విశ్వాసంలో స్తిరపడే బంధుత్వము ఒక ఉదాహరనముగా కనబడుతుంది మరియు పరస్పర అంకిత భావాన్ని విశదీకరిస్తుంది. దేవుని పట్ల శ్రద్ద, భక్తి, వినయము, విధేయత రూతు జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు అంతే కాకుండా నిజ జీవితంలో ఏది ఉత్తమమైనదో దాన్ని ఎంచుకునే విషయంలో మనకు ఈ గ్రంథం దోహదపడుతుంది. నిరాశపూర్వకమైన పరిస్తితులలో కుడా నిస్వార్ధమైన జీవతం జీవించడానికి నేర్పిస్తుంది ఈ గ్రంథం.

రూతు మోయాబియురాలు అనగా దేవునికి అయిష్టమైన జనాగం నుండి వచ్చిన స్త్రీ అయినప్పటికి ఆమెకు దేవుని పట్ల ఉన్న ఆసక్తి, వ్యక్తిగతంగా ఆమె గుణ లక్షణాలు ఆమెను క్రీస్తు వంశావళిలో ఒక చక్కటి స్థానాన్ని పొందుకునేలా చేసింది. మన కిర్తి ప్రతిష్టలు మనం జివించే విధానాన్ని అధారంచేసుకొని ఉంటాయి. ఎలాంటి కష్ట సమయాల్లో కుడా మనం ఓర్పు సహనం కలిగి ఉంటే ఉన్నతమైనవాటిని చేరుకునే అవకాశం ఉంటుంది.

దేవుడు మనకు చూపించే కృప ఎంతో అధికం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అయన మనలను ప్రేమించేవాడిగా ఉంటాడు. విధేయత వలన ఆశీర్వాదం మరియు దేవుని యొక్క ప్రణాళికలో ఒక చక్కటి స్థానాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది.


Share this post