Skip to Content

రాజులు రెండవ గ్రంథము

  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

వాగ్దానదేశములో నివాసమును స్థిరపరచిన దేవుని ప్రజల అంధకార దినములను గూర్చి రాజుల రెండవ పుస్తకము చిత్రించి చూపించుచున్నది. దేవునితో ఉన్న ఒడంబడికను దేవుని ఆజ్ఞలను మరచి విగ్రహారాధన చేసి చెడిపోయిన జీవితములో మునిగిపోయిన ప్రజల మీదికి వచ్చిన భయంకర న్యాయ తీర్పునే ఈ పుస్తకములో మనము చూచుచున్నాము. చివరి ఘట్టం వరకు ఇశ్రాయేలులోనూ, యూదాలోనూ పాలించిన రాజుల గురించిన దృశ్యములను మార్చి మార్చి చూపించుచున్నాడు గ్రంథకర్త.

     ఇశ్రాయేలు, 19 మంది దుష్టపాలకుల పరిపాలన ముగిసిన తరువాత అపూరుకు బానిస అయినది. దీనితో పోల్చి చూసినపుడు యూదా చరిత్ర ఉన్నతముగా ఉన్నది అని చెప్పవచ్చును. అక్కడ అప్పుడప్పుడు దైవభక్తి కలిగిన కొందరు రాజులు లేచి తమ పితరులు నిలిపిన బలిపీఠములను, విగ్రహములను తీసివేసి ప్రజల జీవితమును చేతనైనంత వరకు పరిశుద్ధపరచ ప్రయత్నించిరి అయినప్పటికీ, చిట్టచివరికి నీతికి బదులు అధికముగా పాపము పెరిగి యూదారాజులు, దేశ ప్రజలు బబులోనుకు చెరగా వెళ్ళిరి.

కాలము : బబులోను చెరపట్టిన కాలమైన క్రీ. పూ. 586 కు ముందు రాజులును గూర్చి ఈ గ్రంథములో ఎక్కువ భాగము వ్రాయబడియుండవచ్చును. సొలొమోను మరణము, ఇశ్రాయేలు విభజన క్రీ.పూ. 930 సంవత్సరములో జరిగినది. ఐక్య ఇశ్రాయేలు రాజ్యము క్రీ.పూ. 1050 నుండి 930 వరకు 120 సంవత్సరములు నిలిచియుండినది. తదుపరి ఉత్తర ఇశ్రాయేలు రాజ్య ము క్రీ.పూ 930 నుండి 722 సంవత్సరముల వరకు 208 సంవత్సరములు కొనసాగినది. క్రీ.పూ 722 సంవత్సరములో అషూరు ఇశ్రాయేలును హస్తగతం చేసుకుని అనేకులైన ప్రజలను చెరగా తీసుకుని వెళ్ళినది. దక్షణ యూదా రాజ్యము దీని తదుపరి 136 సంవత్సరములు కొనసాగినది. క్రీ. పూ. 586 లో బబులోను చెర ద్వారా అది కూడా పతనమైనది. ఈ విధముగా క్రీ.పూ 1050 నుండి 586 వరకైన 464 సంవత్సరములు ఇశ్రాయేలు చరిత్రకాలములో ప్రపంచములో చాలా గొప్ప రాజకీయ మార్పులు చోటుచేసుకున్నవి. పాలస్తీనా భూభాగము పై అనేక సార్లు ఐగుపుకు, అషూరుకు మారిమారి అధికారము, పాలన ఉండినది. అప్పుడు విస్తరించిన అషూరు సామ్రాజ్యము కొంచెము కాలము తరువాత పతనమైనది. బబులోను దానిని తనలో విలీనం చేసుకున్నది.

ఉద్దేశ్యము : దేవుని న్యాయకత్వమును అంగీకరించుటకు సిద్ధమనస్సు లేని ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చూపించుట.

గ్రంథకర్త : యిర్మీయా

నేపథ్యము: ఒకే రాజ్యముగా ఉండిన ఇశ్రాయేలు దేశము విభజింపబడిన నూరు సంవత్సరముల తరువాత

ముఖ్య వచనములు : 2 రాజులు 17:22-232 రాజులు 23:27

ముఖ్యమైన వ్యక్తులు : ఏలియా, ఎలీషాషూనేమీయురాలునయమాను, యెజెబెలుయెహూయోవాషుహిజ్కియా, మనషేయోషియా, యెహోయాకీము,సేన్హేరీబు, యెషయాసిద్కియా, నెబుకద్నేజరు.

పుస్తకము యొక్క ప్రత్యేకత : పాత నిబంధన చివరలో కనబడు 17 ప్రవచన పుస్తకములు రెండవ రాజుల పుస్తకముతో పోల్చి చూసి నేర్చుకొనదగినవి.

గ్రంథ విభజన : రాజులు రెండవ పుస్తకమును రెండు పెద్ద భాగములుగా విభజించవచ్చును. . 1. విడిపోయిన తరువాత ఏర్పడిన రెండు రాజ్యముల చరిత్ర. (1 - 17 అధ్యాయము) 2. అష్హురుతో యుద్ధము తరువాత నిలిచియున్న ఏక రాజ్య మైన యూదా చరిత్ర ( 18 - 25 అధ్యాయము).

     ఇశ్రాయేలు పతనమునకు ఆరు సంవత్సరములకు ముందు హిజ్కియా యూదాకు రాజాయెను. ఆయన యొక్క మంచి దైవభక్తి చేసిన ఉజ్జీవ కార్యములు, వీటిని బట్టి దేవుడు యూదాను శత్రువుల నుండి విడిపించి వారికి ఐశ్వర్యమును, సుఖవంతమైన స్థితిని ఇచ్చెను. అయినప్పటికి హిజ్కియా కుమారుడైన మనషె కాలంలో దేశము చెడుతనములోకి తిరిగి కూరుకుపోయినది. మనషె యొక్క మనుమడైన యోషియా

మెచ్చుకొనదగిన, పరిశుద్ధపరచు కార్యముల వలన రావలసిన నాశనమును ఎన్నటెన్నటికి రాకుండా ఆపలేకపోయినది. యోషియా తరువాత వచ్చిన నలుగురు రాజుల కాలంలో బబులోను యొక్క తీవ్రమైన యుద్ధములు కొనసాగినవి. బబులోను రాజు మూడుసార్లు యూదులను చెరపట్టుకుని వెళ్ళెను. మూడవసారి యెరూషలేము నగరము, దేవాలయము నాశనమైనవి. చివరి ఘట్టములో యూదాలో మిగిలిపోయిన వారికి రాబోవు నిరీక్షణను చూపి, ఒప్పింపజేసి ఈ పుస్తకము ముగింపగుచున్నది. ఇశ్రాయేలులోనూ ఇంకా యూదాలోనూ రాజుల పరిపాలనా కాలయములో మనుష్యుల హృదయములను దేవుని వైపు త్రిప్పుటకు అనేక మంది ప్రవక్తలను దేవుడు తపెను, ఏలియా, ఎలీషాఆమోసుహోషేయా అనువారు ఇశ్రాయేలులోను ఓబద్యాయోవేలుయెషయామీకా, నహూము, జెఫన్యాయిర్మీయాహబక్కూకు అనువారు

యూదాలో వారి సేవలను జరిగించిరి.

కొన్ని కుప్ల వివరములు : పరిశుద్ధ గ్రంథములోని 12వ పుస్తకము ; అధ్యాయములు 25; వచనములు 719; ప్రశ్నలు 118; చరిత్రకు సంబంధించిన వచనములు 560; నెరవేరిన ప్రవచనములు 58; నెరవేరనివి 1; హెచ్చరికలు 65; ఆజ్ఞలు 118; వాగ్దానములు 3; దేవుని సందేశములు 20.


Share this post