Skip to Content

గలతీయులకు వ్రాసిన పత్రిక

23 July 2024 by
Sajeeva Vahini
  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

గలతీయ ప్రజలు యేసుక్రీస్తు నందుగల విశ్వాసముచే రక్షించబడిన తరువాత తమ విశ్వాస ప్రయాణమును త్వరలో నిలిపివేసి క్రియలతో కూడిన ఒక నూతన ప్రయాణమును ప్రారంభించుటను చూడగలము. ఇది పౌలు హృదయమును బాధించెను. విశ్వాసమును ప్రక్కన నిలిపిన క్రియల యొక్క యీ విశేషమునకు విరోధముగా ఒక కఠినమైన సాధనము, విశ్వాస సువార్త కొరకైన నిరూపణముగా గలతీ పత్రిక చిగురించుచున్నది.

     ఒక అపొస్తలుడను రీతిలో దేవుని యొద్ద నుండి తనకు లభించిన ఒక అధికారమును తన వర్తమానము యొక్క దైవీకతత్త్వమును గూర్చి ధర్మశాస్త్రము మూలమున కాదు, విశ్వాసము మూలముననే లభించుచున్నది. ధర్మశాస్త్రము మానవుని నేరస్థుడు అని తీర్పు తీర్చి బంధించుచున్నది. విశ్వాసమైతే క్రీస్తునందు గల ఆశీర్వాదములను అనుభవించుటకు వారిని స్వతంత్రులనుగా చేయుచున్నది. అయిననూ స్వతంత్రమనునది అవిధేయత గల జీవితపు ఒక అధికార యోగ్యతా పత్రము కాదు. పరిశుద్దాత్మచే నింపబడిన ఒక జీవితవిధానము ద్వారా హద్దులో జీవించి నీతిఫలములనిచ్చునదైన స్వతంత్రము.

     గలతీయ దేశమందుగల కొన్ని సంఘములకు పౌలు యీ పత్రికను వ్రాయుచున్నాడు. (గలతియులకు 1:2) కనుకనే అనేక సంఘములను ఒకటిగా ఆహ్వానించి వ్రాయబడిన ఒక ఉత్తరము ఇది.

ఉద్దేశము:- అన్య జనులలో నుండి క్రైస్తవ విశ్వాసమునకు వచ్చువారు రక్షింపబడవలెనన్నచో ధర్మశాస్త్రవు ఆజ్ఞలకు లోబడవలెనను యూదా మతభక్తి గలవారిని ఖండించుటయు, క్రైస్తవులను విశ్వాసమునకు, క్రీస్తు చెంతకును, స్వతంత్రమునకును ఆహ్వానమునిచ్చుట.

గ్రంథ రచయిత:- పౌలు

ఎవరికి వ్రాసెను?: - దక్షిణ గలతీయ సంఘములకు (పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణమందు నెలకొల్పబడిన సంమములు ఇవి.)

ఆంతర్యము:- ప్రారంభకాల సంఘము ఎదుర్కొనిన ప్రాముఖ్యమైన సమస్య అన్యజనులలో నుండి రక్షించబడుచున్న క్రైస్తవ విశ్వాసుల ధర్మశాస్త్రపు ఆజ్ఞలకు లోబడవలెనా, లేదా అనునదే. పౌలు యొక్క మొదటి సువార్త సేవ ప్రయాణమందు నెలకొల్పబడిన సంఘములన్నిటి యందును యీ సమస్య కలిగెను. దీని పరిష్కారమును చూచుటకే పౌలు యీ పత్రికను వ్రాసెను. ఏ విధము చేతనైనను యీ సమస్యకు సంఘనాయకులు ఏకముగా కూడి పరిష్కారము చేసిరి. (అపొ.15)

ముఖ్య పాత్రలు: - పౌలుపేతురు, బర్నబాతీతుఅబ్రాహాము, అబద్ధ బోధకులు.

ముఖ్య స్థలములు:- గలతీయయెరూషలేము.

గ్రంథ విశిష్టత:- గుర్తించబడిన ఒక సంఘము కొరకు వ్రాయబడిన పత్రిక కాదు. గలతీయ ప్రాంతమందుగల పలు సంమముల కొరకు వ్రాయబడినది.

ముఖ్య వాక్య పదజాలము:- sధర్మశాస్త్రము నుండి విమోచన.

ముఖ్య వచనములు:- గలతియులకు 2:20-21గలతియులకు 5:1

ముఖ్య ఆధ్యాయము:- అధ్యా.5 “మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసికొనక, ప్రేమగలిగినవారై యొకనికొకడు దాసులై యుండుడి” (గలతియులకు 5:13). "ఆత్మానుసారముగా నడచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు” (గలతియులకు 5:16) “ అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు”. (గలతియులకు 5:22-23).

గ్రంథ విభజన:- క్రైస్తవ స్వాతంత్ర్య హక్కు గల పత్రముగా యీ పత్రిక పిలువబడుచున్నది. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అను పౌలు యొక్క ప్రకటన పత్రము అనియు దీనిని చెప్పవచ్చును. క్రీస్తునందు గల స్వాతంత్ర్యమును విక్రయించుటకు జంకని ఒక సమూహము యొక్క పేరుననే పౌలు యీ పత్రికను వ్రాసెను. యూదులైన కొందరు ధర్మశాస్రోపదేశకుల దాసత్వము విత్తు ఉపదేశమును విని యేసు ద్వారా లభించు స్వాతంత్ర్యమును వారి పాదముల చెంత అర్పించుటకు యీ ప్రజలు సిద్ధపడిరి.

వీరి బుద్ది హీనతను కఠినమైన మాటలచే ఖండించియు, దేవుని సత్యమును పట్టుకొని ఆత్మ యొక్క స్వాతంత్ర్యమును స్థిరపరచుటకు ఆహ్వానమునిచ్చుచు పౌలు వ్రాసిన యీ పత్రికయందు దేవుని కృపా సువార్తను మూడు విధములుగా అనుచరణలోనికి తెచ్చుటను చూడగలము.

(1) కృపా సువార్తను స్థిరపరచుట. అధ్యా.1,2.

(2) కృపా సువార్తను వివరించుట. అధ్యా.3,4.

(3) కృపా సువార్త యొక్క అనుచరణ విధానము. అధ్యా. 5,6.

కొన్ని ముఖ్య వివరణలు:- పరిశుద్ధ గ్రంథము యొక్క 48వ పుస్తకము, అధ్యాయములు 6; వచనములు 149; చారిత్రక వచనములు 144; నెరవేర్చబడిన ప్రవచనములు 1; నెరవేర్చబడని ప్రవచనములు 4; ప్రశ్నలు 19.

 


Share this post