Skip to Content

Telugu Bible Quiz

  • Author: Francis Paul KC
  • Category: Bible Quiz
  • Reference: Sajeeva Vahini

Bible Quiz

1. ఏ రాజు మృతినొందిన సంవత్సరమున యెషయా కు పరలోక దర్శనము కలిగెను ?

2. సొలొమోను ఎవరికంటే జ్ఞానవంతుడై ఉండెను ?

3. హిజ్కియాకు ఎన్ని సంవత్సరములు ఆయుష్షును యెహోవాపెంచెను?

4. సత్యమును ఎదురించువారు ఎవరు ?

5. దిగంబరియై జోడు లేక నడచిన వారు ఎవరు ?

6. ఏ కళ్లము నొద్ద ఎడ్లకు కాలు జారింది ?

7. సమాధికి ఎదురుగ కూర్చుండిన స్త్రీ ఎవరు ?

8. జ్ఞానము తనకు ఎన్ని స్తంభములు చెక్కుకున్నది ?

9. దేవుని తోటయగు ఎదోను లో నీవుంటివి? అని ఎవరిని గురించి చెప్పబడింది ?

10. గోడ లో నుండి మొలచు మొక్క ఏది ?

11. 276 ఈ సంఖ్య ఎవరిదీ ?

12. నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును అని ఎవరితో ఎవరు అన్నారు ?

13. దైవ జనుడైన మోషే చేసిన ప్రార్థన ఏది?

14. 7 నేత్రములు ఉన్న రాయి ఎవరి ఎదుట నుంచబడినది ?

15. జెలలు గల నీళ్ల బావి పేరు ఏమిటి ? అది ఎక్కడ ఉన్నది ?

16. ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని --- రెఫరెన్సు

17. నీవు నా ఎముకయు నా మాంసమునై యున్నావు అనెను--రెఫరెన్సు

18. గాడిద పాతిపెట్ట బడు రీతిగా పాతి పెట్ట బడేది ఎవరు?

19. నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని అన్నది ఎవరు ?

20. "ఊజు" దేశములో నివసించు "కుమారీ " ఎవరు?

21. దత్త పుత్రాత్మ అంటే అర్థమేమి ?

22. హిద్దెకెలు నదీ తీరమున ఉన్నది ఎవరు ?

23. మోషే యొక్క శరీరమును గూర్చి ఎవరు ఎవరితో వాదించారు ?

24. నీవే నిత్యజీవపు మాటలు గలవాడివి అన్నది ఎవరు? ఎవరి గురుంచి ?

25. కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱ పెట్టినది ఎవరు ?

26. దమస్కు లోని రాజు పేరు ?

27. గోమెరు కుమార్తె ఎవరు ?

28. 1260 దినములు ప్రవచించినవారు ఎంత మంది ?

29. నాకు దీవెన దయచేయుము అన్నది ఎవరు ?

30. ఆత్మను బట్టి విత్తువాడు ఏ పంటను కోయును ?

31. బయలు ప్రవక్తలను ఎవరు ఎక్కడ వదించారు ?

32. మందసములో ఏమి ఉన్నాయి ?

33. ఫరో తో మాటలాడినపుడు మోషే అహరోనులు వయసు ఎంత ?

34. "క్రీస్తు " అను పేరునకు అర్థములు ?

35. బయల్పెరాజీము అంటే అర్థము ?

36. యెహోవా మందిరము మరియు రాజా నగరు ఖజానా ల లోని పదార్థములను ఎత్తికొని పోయిన రాజు ఎవరు ?

37. _________ కొండమీద బాకా ఊదుడి

38. యోనాతాను కుమారుని పేరు ?

39. పరిశుద్ధ గ్రంథములోని చిన్న పుస్తక ము ఏది ? ఎన్ని అధ్యాయాలు ?ఎన్ని వచనాలు ?

40. అబీమెలెకు ఎవరిని కూలికి పెట్టుకున్నాడు ?

41. అనాకీయుల వాలే ఉన్నత దేహులు _________

42. దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే ఎవరు?

43. యెహోవా అగ్ని రగులు కొనిన చోటునకు పెట్టిన పేరు?

44. సజ్జనుడును నీతిమంతుడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్న వాడు ఎవరు ?

45. పరిశుద్ధ గ్రంధుములోని పుస్తకాలు ఎన్ని ? అన్నే అధ్యయాలు కల పుస్తకము ఏది ?

46. ఎఫెసులో భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిన వారు ఎంత మంది ?

47. ఏ దినమున యెహోషాపాతు ఏ లోయలో కూడుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు?

48. ఇశ్రాయేలీయులు విడిచిపోయినట్లు, లేవీయులు విడిచిపోయినట్లు విడిచి పోలేదు అని ఎవరు ఎవరిని గురించి యెహోవా అన్నాడు ?

49. దావీదు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడక ఎక్కిన కొండ ఏది ?

50. ఆల్ఫా ఒమేగా అని ఎక్కడ ఎన్నిసార్లు ఉన్నది ?

Answers:

1. రాజైన ఉజ్జియా

2. తూర్పుదేశ స్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను

3. 15

4. యన్నే, యంబ్రే

5. యెషయా

6. కీదోను

7. మగ్దలేనే మరియయు, వేరొక మరియయు

8. 7

9. తూరు రాజును గూర్చి

10. హిస్సోపు

11. ఓడలో ఉన్న వారు

12. జెరుబ్బాబెలూ,సైన్యములకు అధిపతియగు యెహోవా

13. కీర్తనలు 90 వ అధ్యాయము

14. యెహోషువ యెదుట

15. ఏశెకు ,గెరారు

16. మార్కు 9:29

17. లాబాను

18. యెహోయాకీమను యూదారాజును

19. యోబు

20. ఎదోము

21. అనగా మన దేహము యొక్క విమోచనముకొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము

22. బెల్తెషాజరు అను దానియేలు

23. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించెను

24. సీమోను పేతురు

25. సమూయేలు

26. దమస్కునకు రెజీనురాజు

27. లోరూహామా

28. నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను

29. అక్సా

30. ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్య జీవమను పంట కోయును

31. ఏలీయా కీషోను వాగు దగ్గరకు

32. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికఱ్ఱయు, , నిబంధన పలకలును ఉండెను.

33. 88,83 (మోషేకు ఎనుబదియేండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు)

34. అభిషిక్తుడు

35. ప్రవాహముల స్థలము

36. ఐగుప్తురాజైన షీషకు

37. సీయోను కొండమీద బాకా ఊదుడి

38. మెఫీబోషెతు

39. II యోహాను పత్రిక

40. అల్లరిజనమును

41. రెఫాయీయుల

42. క్రీస్తుయేసను నరుడు

43. తబేరా

44. అరిమతయి యోసేపు

45. 66 పుస్తకాలు,యెషయా

46. వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు

47. నాల్గవ దినమున వారు బెరాకా లోయలో కూడిరి.అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకాలోయ యని పేరు.

48. యాజకుల

49. దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు

50. 3


Share this post